వాళ్లను భయపెడుతున్న పవన్ కళ్యాణ్.. పవర్ స్టారా మజాకా..

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)

అవును ఇపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే అందరు ఒణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే...

  • Share this:
    అవును ఇపుడు పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే అందరు ఒణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే... సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో ముందుగా హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటిస్తుండంతో ఆయన అభిమానులు స్క్రీన్ పై వకీల్‌ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ పాత్ర దర్శక,నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సినిమాలో పవన్ సరసన నటించాలంటే హీరోయిన్లు ఎవరు ముందుకు రావడం లేదని టాక్.

    వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c
    వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c


    ఎందుకంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడమే అని చెబుతున్నారు. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రను ప్రేక్షకులు గుర్తించకపోవడమే కష్టమని భావించిన హీరోయిన్లు ఈ సినిమాలో నటించేందకు కొంచెం భయపడుతున్నారు. ముందుగా ఈ పాత్రలో శృతి హాసన్, అనుష్క,పూజా హెగ్డే, నయనతార వంటి స్టార్స్ పేర్లు వచ్చినా.. అవేమి నిజం కాదని తేలిపోయింది. మరి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: