Home /News /movies /

TOLLYWOOD HEROINES SHRUTI HAASAN TAKES SHOCKING DECISION ABOUT HER CHANGE NR

Shruti Haasan: నన్ను నేను మార్చుకోవడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్న: శృతి హాసన్

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తుంది.

    Shruti Haasan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది. ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తనలో మార్పు కోసం ఓ నిర్ణయం తీసుకుందట.

    కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శృతిహాసన్ మళ్లీ ప్రస్తుతం రీ ఎంట్రీ తో పలు అవకాశాలు అందుకుంది. మంచి కెరీర్ సమయం లో ఉన్న శృతి హాసన్ ఇంగ్లాండ్ సింగర్ తన మాజీ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో బాగా ప్రేమాయణంలో ఉండి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది. ఇక అతడితో బ్రేకప్ తర్వాత మళ్లీ నటిస్తుంది. ప్రస్తుతం హజారికా తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

    ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదిక ద్వారా కాసేపు ఫాలోవర్స్ ముచ్చటించగా.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అందులో తనకు తాను రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్న ఎదురవగా దానికి స్పందించిన శృతి. విరామం అనేది తనకు తానే తీసుకున్నదట. అంతేకాకుండా దాని వల్ల తను తనను ఎంతగానో మార్చుకోవడానికి, ఆ మార్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నదట. అంతేకానీ ఆ పని మీద ఆసక్తి లేకపోవడంతో విరామం తీసుకోలేదని తెలిపింది.

    దానిని మరింత మెరుగు పరచడానికి తాను అలా నిర్ణయం తీసుకుందట. ఇక తనకు గతంలో సంగీతంపై దృష్టి పెట్టడానికి ఆసక్తి ఉండేది కాదట. కానీ సంగీతం ఇష్టమని.. ఇప్పుడు సంగీతం, నటన పట్ల సమానంగా బాధ్యతలు వహిస్తున్నానని తెలిపింది. అంతేకాకుండా లాక్‌డౌన్‌ తర్వాత ఓ షార్ట్ ఫిలిం లో నటించిందట. ఇక ఓ వెబ్ సిరీస్ లో కూడా చేశానంటూ.. ఆ తర్వాత క్రాక్, వకీల్ సాబ్ లో కూడా నటించానని తెలిపింది. ఇక ప్రస్తుతం తమిళంలో లాభం అనే సినిమా పూర్తి చేసిందట. ఇదిలా ఉంటే ప్రస్తుతం సలార్ సినిమా లో నటిస్తుందని సంగతి తెలిసిందే.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Breakup, Childhood, Hassan, Kamal hassan, Parents’ divorce, Sarika, Shruthi, Shruthi haasan, Shruthi haasan hot, Shruthi hasan hot, Shruthi hassan, Shruthi hassan hot, Shruti, Shruti haasan, Shruti haasan age, Shruti haasan facebook, Shruti haasan fb, Shruti haasan funny, Shruti haasan gq, Shruti Haasan hot, Shruti haasan instagram, Shruti haasan interview, Shruti haasan movies, Shruti haasan navel, Shruti haasan size, Shruti haasan songs, Shruti Haasan twitter, Shruti hasan hot, Shruti hassan, Shruti hassan hot, Shruti hassan hot scenes, Shruti hassan interview, Shruti hassan songs, Sister Akshara, Tollywood actress, Wonderful parents, శృతి హాసన్, శృతి హాసన్ హాట్, శృతి హాసన్ హాట్ ఫోటోస్

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు