Tollywood Heroines Plastic surgeries: ప్లాస్టిక్ సర్జరీ ముందు ఆలా.. తర్వాత ఇలా మారిపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే!

Tollywood heroines plastic surgeries

Tollywood Heroines Plastic surgeries:  టాలీవుడ్ లో హీరోయిన్స్ ఎంత అందంగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. అయితే వారిలో ఎంతోమంది హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు

  • Share this:
    Tollywood Heroines Plastic surgeries:  టాలీవుడ్ లో హీరోయిన్స్ ఎంత అందంగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. అయితే వారిలో ఎంతోమంది హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. మొదటి సినిమాకు ప్రస్తుత సినిమాకు వారిలో చాలా తేడాలు ఉంటాయి. చిన్న చిన్న సర్జరీలతో ఎంతో క్యూట్ లుక్ ని సొంతం చేసుకుంటారు ఈ హీరోయిన్స్. ఇక అలా ఏ హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారో ఇప్పుడు చూద్దాం.



    1. శృతి హాసన్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. నటిగా కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె తన కెరీర్ మొదట్లో ముక్కు ప్లాస్టర్ సర్జరీ చేయించుకుంది. నిజానికి తనకు ఎటువంటి సౌందర్యానికి సంబంధించిన ఇబ్బందులు లేకపోగా కొన్ని అనారోగ్య కారణాల వల్ల తనకు సర్జరీ జరిగింది.



    2. అక్కినేని సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని. తెలుగుతోపాటు తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమెకు కూడా 2012లో ముక్కు సర్జరీ జరిగింది. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా తర్వాత సమంత లుక్ ను చూసి షాక్ అయ్యారు. ఇక చాలా మంది అభిమానులు సమంత ఇప్పుడు కంటే అప్పుడే బాగుందని అన్నారు.



    3. కాజల్ అగర్వాల్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగుతోపాటు తమిళం, హిందీలో కూడా నటించింది. మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కాజల్ కి తన ముఖంలో కొన్ని లోపాలవల్ల మైనర్ సర్జరీ జరిగింది. ఇక తన ముక్కుకు కూడా అమెరికాలో సర్జరీ చేయించుకుంది.



    4. నయనతార: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కూడా తన శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకుంది. తన శరీరం మరింత చైతన్యంగా కనిపించడానికి ఆయుర్వేద చికిత్స కూడా తీసుకుంది.



    5. త్రిష కృష్ణన్: తెలుగు స్టార్ హీరోయిన్ త్రిష. మోడల్ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈమె కూడా తన ముక్కు సర్జరీ చేయించుకుందని పుకార్లు వినిపించాయి. కానీ ఈ విషయం గురించి తను స్పందించలేదు.



    6. అనుష్క శెట్టి: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తను కూడా తన శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకుందని పుకార్లు వచ్చాయి.ఇక తన నడుము, నాభి చుట్టూ ఉన్న కొవ్వుని మాత్రం తగ్గించుకుంది.
    Published by:Navya Reddy
    First published: