Akkineni Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి తెలియని వారేవ్వరు లేరు.తన నటన గురించి చెప్పాలంటే అంతా ఇంతా కాదు. ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో, అందంతో మాయ చేసి తన వైపు లాక్కుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా సమంత అక్కినేని పేరుని తొలగించింది.
అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య ను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలలో కొనసాగుతూ మంచి సక్సెస్ ను అందుకుంది. పైగా బిజినెస్ రంగాలలో కూడా అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సమంత. నిత్యం తన ట్రెండీ ఫోటోలను, హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.
ఇదిలా ఉంటే తన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాలో ఇన్ని రోజుల వరకు తన పేరు 'సమంత అక్కినేని' అని ఉండేది. కానీ తాజాగా ఆ పేరుని తీసేసి 'S' అని ఒక లెటర్ ని మాత్రమే ఉంచింది. దీంతో ఉన్నట్టుండి సమంత 'అక్కినేని' అని ఎందుకు తీసేసింది అని పలు రకాల సందేహాలు ఎదురవుతున్నాయి. పైగా సమంత అభిమానులు కూడా ఈ విషయం గురించి బాగా చర్చలు చేస్తున్నారు. ఇక కొందరు ఏదైనా బిజినెస్ గురించి ఆ లెటర్ తో ఏమైనా ప్రచారం చేస్తుందేమో అని అనుకోగా.. మరికొందరు మామూలుగా ఎడిట్ చేసిందేమో అని అనుకుంటున్నారు. కానీ ఈ విషయం గురించి అసలు కారణం తెలియక పోగా దీని గురించి సమంత ఎప్పుడు చెబుతుందో చూడాలి.
ఇక ఇటీవలే ది ఫ్యామిలీ మాన్ 2 అని వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీ లో నటిస్తుంది సమంత. ఇక తమిళంలో కూడా ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni samantha, Social Media, Tollywood