హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Akkineni: ఆ ఒక్క మాటతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీ డౌట్స్ అన్ని క్లియర్!

Samantha Akkineni: ఆ ఒక్క మాటతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీ డౌట్స్ అన్ని క్లియర్!

Samantha Akkineni

Samantha Akkineni

Samantha Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా తెలుగింటి కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సమంత, నాగ చైతన్య విషయం గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...

  Samantha Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా తెలుగింటి కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సమంత, నాగ చైతన్య విషయం గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. సమంత నాగ చైతన్య మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా వీరిరువురు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విధంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అక్కినేని కుటుంబం కానీ సమంతా గాని స్పందించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం సమంత హైదరాబాద్ లో కాకుండా చెన్నైలో తన స్నేహితులతో కలిసి ఉండటంతో వీరి గురించి వస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

  ఇకపోతే సమంత నాగచైతన్య విడాకులు గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ లేక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నాగార్జున చేసిన పోస్టుపై సమంత రిప్లై ఇచ్చారు... ఇలా రిప్లై ఇచ్చిన వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేస్తూ.. మరొక పోస్ట్ పెట్టడం మరిన్ని సందేహాలకు దారితీస్తోంది. ఇది చూసిన నెటిజన్లకు సమంత విడాకులు విషయంపై కొంతవరకు స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు.

  ఇది కూడా చదవండి:'సైమా' అవార్డ్స్ 2019 విజేతలు.. ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ నటిగా ఎవరంటే?

  ఈ సందర్భంగా నాగార్జున పోస్ట్ చేస్తూ... సెప్టెంబర్ 20వ తారీకు.. నాకు ఎంతో ముఖ్యమైన రోజు.. నా హీరో, నా ప్రేరణ నాన్న గారి పుట్టినరోజు అంటూ ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో పై సమంత రిప్లై ఇస్తూ.." చాలా బాగుంది నాగార్జున" అంటూ రిప్లై ఇచ్చారు. ఎప్పుడు తన మామని నాగ్ మామ అంటూ పిలిచే సమంత నేడు ఏకవచనంతో నాగార్జున అని పెట్టడంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.


  ఈ క్రమంలోనే ఈ పోస్ట్ పై అక్కినేని అభిమానులు సమంత పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన సమంత వెంటనే ఆ క్యాప్షన్ డిలీట్ చేసి.. వెంటనే "నాగార్జున మామ" అంటూ తన గురించి వస్తున్న విడాకుల విషయం పై క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. నాగార్జున మామ అంటూ సంబోధించడంతో వీరి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్థలు లేవని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున పోస్టుకు సమంత రిప్లై ఇచ్చినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Naga Chaitanya, Nagarjuna Akkineni, Samantha akkineni, Tollywood