హోమ్ /వార్తలు /సినిమా /

Rashmika Mandanna: రష్మిక చెల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందొ!

Rashmika Mandanna: రష్మిక చెల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందొ!

Rashmika mandanna

Rashmika mandanna

Rashmika Mandanna: టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ఈ మధ్య మరింత యాక్టివ్ గా కనిపిస్తుంది. వెండి తెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

Rashmika Mandanna: టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ఈ మధ్య మరింత యాక్టివ్ గా కనిపిస్తుంది. వెండి తెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంది. మొత్తానికి బిజీ లైఫ్ లో ఉన్న రష్మిక ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తన ఖాతా నింపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తనకి ఇష్టమైన వాళ్లకి బర్త్ డే విషెస్ చెబుతూ మిస్ అవుతున్నానని ఎమోషనల్ అయ్యింది.

Rashmika mandanna
Rashmika mandanna

సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను తెగ షేర్ చేసుకుంటుంది ఈ కన్నడ బ్యూటీ. ఇక తాజాగా తన చిట్టి చెల్లెలు షిమాన్ మందన పుట్టినరోజు సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న రష్మిక.. తన చెల్లి పుట్టినరోజు వేడుకలకు మిస్ అవుతునందుకు కాస్త ఎమోషనల్ అయ్యింది. 'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ బేబీ.. సిస్టా లవ్స్ యూ మోస్ట్.. మిమ్మల్ని నేను ఎప్పుడూ బాధపెట్టను అంటూ.. పరిస్థితులన్నీ మామూలు స్థితికి రాగానే ఇంటికి వచ్చేస్తా.. అప్పుడు నీ పుట్టిన రోజు స్పెషల్ గా జరుపుకుందాం మై డార్లింగ్' అంటూ పంచుకుంది.


ఇక తన చెల్లి తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఇక ఈ పోస్ట్ ని చూసిన నెటిజనులు.. రష్మిక చెల్లికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాల్లో బిజీగా ఉండగా.. త్వరలోనే విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ లో మరో సినిమా అవకాశం కూడా వచ్చిందని తెలుస్తుంది.

First published:

Tags: Baby sister, Kirak party, Kollywood, Rashmika mandanna, Shiman Mandanna, Tollywood heroine, Vijay devarkonda

ఉత్తమ కథలు