హోమ్ /వార్తలు /సినిమా /

KondaPolam - Rakul Preet Singh: కొండపొలం కోసం ప్రత్యేక భాష నేర్చుకున్న రకుల్ ప్రీత్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

KondaPolam - Rakul Preet Singh: కొండపొలం కోసం ప్రత్యేక భాష నేర్చుకున్న రకుల్ ప్రీత్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

KondaPolam - Rakul Preet Singh

KondaPolam - Rakul Preet Singh

KondaPolam - Rakul Preet Singh: ఉప్పెన సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటారు.

ఇంకా చదవండి ...

KondaPolam - Rakul Preet Singh: ఉప్పెన సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే తన రెండవ సినిమా క్రిష్ దర్శకత్వంలో నటించిన సంగతి మనకు తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన టువంటి చిత్రం "కొండపొలం".ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 8వ తేదీన విడుదల కానుందని చిత్ర బృందం అధికారులు ప్రకటించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక గిరిజన యువతి పాత్ర ద్వారా సందడి చేయబోతున్నారు.

ఓబులమ్మ అనే పాత్రలో నటిస్తున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ఈ సినిమాలో గిరిజన అమ్మాయిగా వాస్తవికంగా ఉండటం కోసం చాలా కష్టపడ్డానని ఓ సందర్భంలో తెలియజేశారు. ఇందులో గిరిజన మహిళగా కనిపించడం కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చుకున్నానని, ముఖ్యంగా ఈ సినిమాలో గొర్రెల కాపరిగా ఉండటం కోసం ఎంతో కష్టపడ్డానని ఓ సందర్భంలో రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి : వైష్ణవ్ తేజ్ కొండ పొలం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

ఆకర్షించడానికి ప్రత్యేకమైన బ్లీటింగ్ శబ్దాలను నేర్చుకోవడమే కాకుండా, ఆ గొర్రెలను నియంత్రణలోకి తీసుకోవడానికి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ఈ సినిమా కోసం ఏకంగా సెట్ లో వెయ్యి గొర్రెలతో షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిపింది. ఇందులో ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి చేయగా, కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో వైష్ణవ్ తేజ్ సందడి చేయనున్నారు.


ఇది కూడా చూడండి:మల్లెపువ్వుల మెరిసిపోతున్న రకుల్ ప్రీత్.. ముద్దొస్తోందిగా?

న్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వై రాజీవ్ రెడ్డి, జె. సాయి బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదల కానుంది.

First published:

Tags: Konda polam, Rakul Preet Singh, Tollywood, Vaishnav tej

ఉత్తమ కథలు