Rakul Preet Singh: పెద్దగా ఏడ్చేసిన రకుల్.. అసలు ఏం జరిగిందంటే?

Rakul Preeth

Rakul Preet Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా అడుగుపెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో ఈ భామ తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకుపోతోంది.

  • Share this:
    Rakul Preet Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా అడుగుపెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో ఈ భామ తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం వివిధ భాషలలో అరడజనుకు పైగా సినిమాలను చేతిలో పెట్టుకున్న రకుల్ కెరియర్ పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

    నిత్యం తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రకుల్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రకుల్ గట్టిగా ఏడుస్తుంది..ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు రకుల్ కి ఏమైంది అంటూ కాసేపు కంగారు పడ్డారు.

    రకుల్ ప్రీత్ సింగ్ ఏడవడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం సరసన లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో "అటాక్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈక్రమంలోనే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో డబ్బింగ్ పనులలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఒక ఏడుపు సన్నివేశానికి సంబంధించిన డబ్బింగ్ రకుల్ ప్రీత్ చెప్పారు.ఇలా ఏడుస్తూ డబ్బింగ్ చెప్పిన సన్నివేశాన్ని వీడియో తీయగా ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.








    View this post on Instagram






    A post shared by Rakul Singh (@rakulpreet)






    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.త్వరగా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకొని ఈ సినిమా ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఇండియన్ 2" చిత్రంలోనూ, అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శకత్వంలో "మేడే" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇలా మొత్తానికి అరడజనుకు పైగా సినిమాలకు సంతకం చేసి రకుల్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.
    Published by:Navya Reddy
    First published: