news18-telugu
Updated: September 28, 2019, 4:39 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ (Source: instagram/ Rakul preet)
బాలీవుడ్ సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారిందీ ఈ భామ. తాజాగా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన రకుల్ తన మనసులో మాట బయట పెట్టింది. తనకు ఏ హీరో అంటే ఇష్టమో చెప్పేసింది రకుల్. తెలుగు సినీ పరిశ్రమలో తనకు హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' కార్యక్రమంలో రకుల్ పాల్గొంది. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా? అని లక్ష్మి ప్రశ్నించింది. దీనికి సమాధానంగా బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ అంటే చాలా ఇష్టమంది. అయితే టాలీవుడ్లో మాత్రం విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పిందీ సెక్సీ బ్యూటీ. రకుల్ ప్రస్తుతం 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది.
Published by:
Sulthana Begum Shaik
First published:
September 28, 2019, 4:37 PM IST