Home /News /movies /

TOLLYWOOD HEROINE PRIYANKA FED HANUMAN WITH HER OWN HANDS FROM THE WINDOW WATCH VIRAL VIDEO NK

Viral Video: కోతులకు ఫుడ్ పెట్టిన ప్రియాంక... అవి ఏంచేశాయో వీడియో చూడండి

కోతులకు ఫుడ్ పెట్టిన ప్రియాంక (image courtesy - instagram)

కోతులకు ఫుడ్ పెట్టిన ప్రియాంక (image courtesy - instagram)

Viral Video: కోతులను చూడగానే మనలో చాలామందికి ఏదో ఒకటి వాటికి పెట్టాలనిపిస్తుంది. హీరోయిన్ ప్రియాంక కూడా అలా చేసింది. ఆ తర్వాత ఏమైందో వీడియో చూడండి.

    Viral Video: ఆదివారం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఆ రోజే కాస్త విశ్రాంతి దొరుకుతుంది. రోటీన్ వర్కుకు భిన్నంగా... మనకు నచ్చిన పని చేయడానికి వీలవుతుంది. చాలా మంది ఆదివారం బయటకు వెళ్తుంటారు. ఐతే... టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక భట్టాచార్య ఆదివారాన్ని ప్రత్యేకంగా గడిపింది. తన లైఫ్‌లో ఓ స్వీ్ట్ మెమరీని మిగుల్చుకుంది. సహజంగానే ఈ అమ్మడు యానిమల్ లవర్. మూగ జీవాలకు సాయం చేస్తూ సంబరపడిపోతుంది. అదో తృప్తి అంటుంది. తాజాగా ఆదివారం ఉదయం అలాంటి ఓ మంచి పని చేసింది. ఓ కొండ ముచ్చు ఆమె ఇంటి... కిచెన్ కి ఉన్న కిటికీ దగ్గరకు వచ్చింది. ఆకలితో ఉన్న ఆ హనుమాన్‌ని చూడగానే ప్రియాంక ఫీలైపోయింది. దానికి ఏదైనా పెట్టాలని అనుకొని అప్పుడే రెడీ చేసుకున్న టోస్టును చిన్న ముక్క దానికి పెట్టింది. అలా పెట్టిందో లేదో... ఇలా ఆ ముక్కను లటుక్కున నోట్లో వేసుకొని గబగబా తినేసింది కొండముచ్చు. దాంతో అది చాలా ఆకలితో ఉందని గ్రహించిన ప్రియాంక... దానికి మరిన్ని ముక్కలు తన చేత్తో పెట్టింది.

    ఈ బ్యూటీఫుల్ వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకుంది ప్రియాంక. ఆమె అలా అలా టోస్ట్ ముక్కలు ఇస్తుంటే... ఆ హనుమాన్ ఎంతో తాపీగా కూర్చొని వాటిని తింటుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. హనుమాన్ కోసం ఆమె బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోయడాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాల్ని అలా దోచేసుకుంటోంది.



    ప్రియాంక భట్టాచార్య టాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్. యంగ్ ఏజ్ నుంచే కెరీర్ ప్రారంభించింది. తుమీ ఆస్బే బాలీ, సీమరేఖ, మా వంటి సీరియళ్లలో నటించింది. తర్వాత ఒక్కసారిగా స్మాల్ స్క్రీన్ నుంచి వెబ్ వరల్డ్ లోకి ఎంటరైంది. హోలీ ఫంక్ లో రైమా కేరక్టర్‌తో అదంరికీ ఎంటర్‌టైన్‌మెంట్ పంచింది. అంతే కాదు... బ్యూమకేష్‌లో సిగ్గుపడే పక్కింటి యువతిగా నటించి మెప్పించింది.




    ఇది కూడా చదవండి: Vastu Shastra: నల్లమట్టిలో ఇల్లు కడితే ఏమవుతుంది... వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది?

    ప్రియాంక త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. ఈ సంవత్సరం ఆమె నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇన్‌సైడ్ జాబ్ రిలీజ్ కానుంది. మరో మూడు సినిమా ఆఫర్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇలా ఈ అమ్మడు సోషల్ మీడియాతోపాటూ... వెండితెరపైనా అభిమానులను సంపాదించుకునేందుకు రెడీ అవుతోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Tollywoood, VIRAL NEWS, Viral vodeo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు