Home /News /movies /

TOLLYWOOD HEROINE MANCHU LAKSHMI LUXARY HOME TOUR VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA NR

Manchu Lakshmi: మంచు లక్ష్మీ ఇల్లు చూశారా.. ఒక్కో గది ఒక్కో లగ్జరీ!

Manchu Lakshmi

Manchu Lakshmi

Manchu Lakshmi: ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం అందరిపై పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలపై ఎక్కువనే చెప్పవచ్చు. కరోనా సమయంలో సినిమాలకు దూరంగా ఉండటంతో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు.

    Manchu Lakshmi: ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం అందరిపై పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలపై ఎక్కువనే చెప్పవచ్చు. కరోనా సమయంలో సినిమాలకు దూరంగా ఉండటంతో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యారు. ఇక అభిమానులు కూడా తమ అభిమానుల నటులతో బాగా ముచ్చట్లు పెడుతుంటారు. అంతేకాకుండా తమ అభిరుచులను తెలుసుకుంటున్నారు. ఇక ఈ మధ్య హోమ్ టూర్ లను కూడా బాగా పంచుకుంటున్నారు సెలబ్రెటీలు. ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

    తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అంత సక్సెస్ కాలేకపోయింది. బుల్లితెరలో కూడా పలు షోలలో హోస్టింగ్ చేసింది. ప్రస్తుతం ఆహా లో ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రామ్ కూడా చేస్తుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా మారింది. తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.



    అంతేకాకుండా తను వర్కవుట్లు చేసే వీడియోలను, తన కూతురుకు సంబంధించిన వీడియోలను కూడా పంచుకుంటుంది. ఇక ఇటీవలే యూట్యూబ్ లో తన పేరుమీద ఓ ఛానెల్ ను కూడా క్రియేట్ చేసుకుంది. ఇక అందులో కూడా ఎన్నో విషయాలు పంచుకుంటుంది. ఇదిలా ఉంటే లగ్జరీ హౌస్ గురించి ఓ వీడియో చేయనుంది. ఇక ఆ వీడియోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. అందులో తన ఇల్లు మాత్రం సూపర్ లగ్జరీ గా కనిపిస్తుంది. తన ఇంటి గేటు నుండి ఇంటి లోపల వరకు కొన్ని గదుల ఫోటోలు పంచుకోగా వాటికీ చేయించిన డిజైన్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని ఫోటోలతో తన ఇంటిని బాగా డెకరేట్ చేసుకుంది. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు బాగా ఆకట్టుకోగా త్వరలోనే ఇంటి మొత్తానికి సంబంధించిన వీడియోను పంచుకోనుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Instagram, Manchu Lakshmi, Manchu lakshmi house, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు