TOLLYWOOD HEROINE MAMTA MOHANDAS RIDES BIKE AFTER 15 YEARS VIDEO GOES VIRAL ON INTERNET NR
Mamta Mohandas: 15 ఏళ్ల తర్వాత ఆ పని చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వైరల్ వీడియో!
mamatha mohandas
Mamta Mohandas: మామూలుగా సామాన్య అమ్మాయిలు నుండి సెలబ్రిటీ హీరోయిన్స్ వరకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టపడతారు. స్కూటీ, కారు లు వంటి వాటిపై ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు డ్రైవింగ్ చేస్తున్నారు.
Mamta Mohandas: మామూలుగా సామాన్య అమ్మాయిలు నుండి సెలబ్రిటీ హీరోయిన్స్ వరకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టపడతారు. స్కూటీ, కారు లు వంటి వాటిపై ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య బైక్ రైడింగ్ అంటూ ఓ రేంజ్ కి ఎదిగిపోయారు. ఇప్పటికే పలుచోట్ల అమ్మాయిలు రోడ్లపై బైక్ డ్రైవింగ్ చేస్తూ అందర్నీ నోరెళ్ళబెట్టేలా చేస్తున్నారు. ఈ మధ్య హీరోయిన్స్ కూడా సెట్ లలో బైక్ రైడింగ్ అంటూ వీడియోలను కూడా పంచుకుంటున్నారు. ఇక తాజాగా మరో బ్యూటీ బైక్ రైడ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇంతకీ బ్యూటీ ఎవరో కాదు మలయాళ సినీ నటి మమతా మోహన్ దాస్. తెలుగులో ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. అంతేకాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ లను పాడి మంచి విజయాన్ని అందుకుంది. ఇక చింతకాయల రవి, కేడి సినిమాల్లో నటించిన తర్వాత ఇక తెలుగులో ఏ సినిమాల్లో నటించలేదు.
mamatha mohandas
ఆ తర్వాత మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినీ పరిశ్రమకు దాదాపు 11 ఏళ్లుగా దూరం గా ఉంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో.. ఓ వీడియోని షేర్ చేయగా.. అందులో మమత బైక్ రైడ్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లా బాగా స్టైలిష్ గా కనిపించింది. అంతేకాకుండా ఎవరో రైడ్ కి తీసుకెళ్తారని వెయిట్ చేయడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్.. కెరీర్ స్టార్టింగ్ లో సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మోటార్ సైకిల్ నడిపే దాన్ని అంటూ ఆ వీడియోకు పోస్ట్ చేసింది.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజనులు తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం లాల్ బాగ్ అనే సినిమాలో నటిస్తుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలకానుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.