హోమ్ /వార్తలు /సినిమా /

Krithi Shetty: కృతి శెట్టి చేతులు మీదుగా ముత్యమంతా ముద్దు సీరియల్.. విలన్‌గా ఆమని?

Krithi Shetty: కృతి శెట్టి చేతులు మీదుగా ముత్యమంతా ముద్దు సీరియల్.. విలన్‌గా ఆమని?

Krithi shetty, muthyamantha muddhu

Krithi shetty, muthyamantha muddhu

Krithi Shetty: ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో నటించిన ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

  Krithi Shetty: ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో నటించిన ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. 17 ఏళ్ల వయసులోనే తన అందంతో, నటనతో కుర్రాళ్ళ మనసులను దోచుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల దృష్టిలో కూడా పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేతుల మీదుగా ఓ సీరియల్ ప్రారంభం కానుంది.

  బాలనటిగా బుల్లితెరకు అడుగుపెట్టిన కృతి శెట్టి మొదట్లో వాణిజ్య ప్రకటనలో నటించింది. ఇక దీంతో ఈ అమ్మడి క్రేజీ హీరోయిన్ వరకు వచ్చింది. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా నాని నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో కూడా బిజీగా ఉంది. ఇవేకాకుండా సుధీర్ బాబు నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది' అనే సినిమాలో కూడా నటిస్తుంది.

  ఇదిలా ఉంటే కృతి శెట్టి చేతులమీదుగా ఓ బుల్లితెర సీరియల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ముత్యమంత ముద్దు' అనే సీరియల్ త్వరలోనే జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇక ఈ సీరియల్ ఓ అమ్మాయి పై ఆధారపడి ఉంది. ఇందులో కృతి శెట్టి అమ్మాయిల గురించి మాట్లాడుతుండగా అందులో ఓ అమ్మాయి తన తల్లిదండ్రులను.. తను పెళ్లి చేసుకునే వ్యక్తి తన ఇంట్లో ఉంచుకుంటేనే ఒప్పుకుంటాను అని అంటుంది. కానీ కృతి శెట్టి అబ్బాయి విషయంలో సరే.. కానీ కాబోయే అత్తయ్య గారు ఇటువంటి కండిషన్స్ ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తుంది.

  View this post on Instagram


  A post shared by Zee Telugu (@zeetelugu)  అంతలోనే ఎంట్రీ ఇస్తుంది సినీ నటి ఆమని. ఇందులో ఆమని ఆ అమ్మాయికి అత్త పాత్రలో నటిస్తుంది. కానీ ఆమని ఇందులో విలన్ పాత్రలో కనిపిస్తుంది. దీంతో రుణం పేరుతో దారుణం చేసే అత్తగా ఆమని.. కన్న వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అంటున్నా అమ్మాయి నేపథ్యంలో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది విడుదలైన చావు కబురు చల్లగా సినిమాతో ఆమని అంత సక్సెస్ అందుకోలేక పోగా.. ఈ సీరియల్ తో తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెడుతోంది. ఇక బుల్లితెరపై ఎటువంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Krithi shetty, Muthyamantha muddhu, Tollywood, Uppena film, Zee telugu

  ఉత్తమ కథలు