హోమ్ /వార్తలు /సినిమా /

Kajal Aggarwal: వామ్మో.. ఆ విషయంలో కాజల్ కు అంత పిచ్చి ఉందా.. డబ్బులు ఇచ్చి మరి ఆ పని?

Kajal Aggarwal: వామ్మో.. ఆ విషయంలో కాజల్ కు అంత పిచ్చి ఉందా.. డబ్బులు ఇచ్చి మరి ఆ పని?

Kajal Aggarwal

Kajal Aggarwal

Kajal Aggarwal: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తన అందంతో ఎంతో మంది యువత మనసులను దోచుకున్న ఈ బ్యూటీ.. మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

Kajal Aggarwal: టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తన అందంతో ఎంతో మంది యువత మనసులను దోచుకున్న ఈ బ్యూటీ.. మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో కాజల్ తగ్గట్లేదు. అంతే కాకుండా ప్రస్తుతం వరుస సినిమాలో కూడా అవకాశాలు అందుకుంది.

పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత కూడా కాజల్ గ్లామర్ విషయంలో తగ్గట్లేదు. అన్ని రకాల వస్త్రధారణలో మెప్పించిన ఈ బ్యూటీ అటు సాంప్రదాయ, ఇటు గ్లామర్ లుక్ లో బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే కాజల్ కు రెడీ అవ్వడం ఎంత ఇష్టమో రెడీ చేయడం కూడా అంటే ఇష్టమట. ఎవరినైనా రెడీ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తుందట కాజల్. ఇక కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ ను కూడా బాగా రెడీ చేసేదట.

ఏమైంది ఈవేళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన నిషా అగర్వాల్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. అంతే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా నటించింది. కానీ ఈ బ్యూటీ అంత గుర్తింపు అందుకోకపోగా.. ఇక తన పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ఇదిలా ఉంటే కాజల్, నిషా ఇద్దరు తోబుట్టువులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఎంతో క్లోజ్ గా ఉంటూ.. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. ఇక కాజల్ అగర్వాల్ కు రెడీ చేయడంలో ఆసక్తి ఉండటంతో తన చిన్నప్పుడు తన చెల్లి నిషా అగర్వాల్ కి డబ్బులు ఇచ్చి మరి హెయిర్ స్టైలింగ్ చేసేదట.

First published:

Tags: Acharya film, Goutham kichlu, Hair styling, Kajal Aggarwal, Megastar Chiranjeevi, Pooja Hegde, Ram Charan, Sister styling, Tollywood heroine

ఉత్తమ కథలు