హోమ్ /వార్తలు /సినిమా /

Jabardasth - Indraja: జడ్జీగా ఇంద్రజ కావాలంటున్న అభిమానులు.. ఆలోచనలోపడ్డ మల్లెమాల?

Jabardasth - Indraja: జడ్జీగా ఇంద్రజ కావాలంటున్న అభిమానులు.. ఆలోచనలోపడ్డ మల్లెమాల?

Jabardasth - Indraja

Jabardasth - Indraja

Jabardasth - Indraja: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా సెలబ్రేట్ లుగా మారారు.

Jabardasth - Indraja: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా సెలబ్రేట్ లుగా మారారు. అంతేకాకుండా వెండితెరపై అవకాశాలు కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఇందులో సినీ నటి ఇంద్రజ జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఇంద్రజ.

జబర్దస్త్ లో జడ్జి గా చేస్తున్న సినీ నటి రోజా కొన్ని రోజులు అనారోగ్య కారణంగా షో కు దూరంగా ఉండగా తన స్థానంలో మరో నటి ఇంద్రజ ను చేర్చారు. ఇక తొలి చూపుల్లోనే అభిమానులను అందుకుంది. వెండితెరపై కూడా అంత గుర్తింపు లేకుండా మొత్తానికి జబర్దస్త్ తో మంచి క్రేజ్ ను అందుకుంది. తన అందం, స్మైల్ తోనే కాకుండా కమెడియన్స్ తో బాగా ఇంటరాక్ట్ అవుతూ మరింత సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇంద్రజ కనిపించకపోవడంతో అభిమానులు అయోమయం అవుతున్నారు.

తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఇంద్రజ కనిపించకపోవడంతో అభిమానులు ఇక కామెంట్స్ చేస్తున్నారు. రోజా తిరిగి కోలుకొని రావడంతో మళ్లీ రోజా జడ్జ్ గా సెట్ అయిపోయింది. దీంతో ఇంద్రజ కనిపించకపోయేసరికి.. రోజా వద్దు, ఇంద్రజ ముద్దు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా మరికొందరు అభిమానులు ఇంద్రజ కోసం జబర్దస్త్ చూస్తున్నామని అనగా మరికొందరు ఇంద్రధనస్సు కనిపించడం లేదంటూ, ఇంద్ర నవ్వు మిస్ అయ్యింది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెనే జడ్జిగా కొనసాగించాలి అని, ఎవరినైతే జనం బాగా ఇష్టపడుతుంటారో వాళ్లని ఉంచారా.. ఇంద్రజ గారిని దయచేసి కొనసాగించండి అంటూ మల్లెమాల కు తెగ రిక్వెస్ట్ లు చేస్తున్నారు అభిమానులు.

First published:

Tags: Indraja, Indraja fans, Indraja Jabardasth, Jabardasth, Jabardasth Promo, Judge roja, Mallemala, Roja, Roja Vs Indraja, Tollywood heroine, Tollywood heroine indraja, ఇంద్రజ, జడ్జీగా ఇంద్రజ, జబర్దస్త్, జబర్దస్త్ కామెడీ షో, జబర్దస్త్ రోజా, టాలీవుడ్, మల్లెమాల, రోజా