హోమ్ /వార్తలు /సినిమా /

Ileana D'Cruz: సినీ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇలియానా..!

Ileana D'Cruz: సినీ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇలియానా..!

Ileana D'Cruz

Ileana D'Cruz

Ileana D'Cruz: టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే. తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ గ్లామర్ బ్యూటీ.

Ileana D'Cruz: టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే. తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ గ్లామర్ బ్యూటీ. ఈ మధ్య తన గ్లామర్ విషయంలో మరింత డోస్ పెంచింది. ఎన్నో సినిమాలలో నటించిన ఇలియానా ఆ మధ్య అవకాశాలు బాగా కోల్పోయింది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. తొలిసారి నటనతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించింది. ఇదిలా ఉంటే గ్లామర్ విషయంలో మంచి ఫిజిక్ ఉండే ఈ భామ.. ఉన్నట్టుండి తన శరీర బరువును పెంచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ఈ మధ్య తన గ్లామర్ ను మళ్లీ పెంచేసింది. తెగ జిమ్ము లు చేస్తూ, యోగాలు చేస్తూ శరీర బరువును తగ్గించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఫోటోలు బాగా షేర్ చేసుకుంటోంది. ఇక ఇండస్ట్రీ పట్ల కూడా బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. తాజాగా సినీ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇలియానా.

సినీ ఇండస్ట్రీ క్రూరమైనది అంటూ ఇక్కడ అవకాశాలు అందడంలో సమానత్వం ఉండదని తెలిపింది. ఇందులో పాపులారిటీనే బిగ్ ఫాక్టర్ అంటూ, ఎప్పుడైతే పాపులారిటీ కోల్పోతారో.. అప్పుడే ఇక్కడ అవకాశాలు కూడా ఉండవని తెలిపింది. ఇక తన విషయంలో కూడా అదే జరిగింది అంటూ అభిమానులతో పంచుకుంది. ఇటువంటి క్రూరమైన పరిస్థితులు ఉన్నచోట నిలబడడం కష్టమని తెలిపింది. ఇక ప్రస్తుతం ఇలియానా ఫేర్ అండ్ లవ్లీ అనే సినిమాలో నటిస్తోంది.

First published:

Tags: Ileana D'cruz, Shocking comments, Telugu film industry, Tollywood, గోవా బ్యూటీ ఇలియానా, టాలీవుడ్, దేవదాసు సినిమా, సోషల్ మీడియా

ఉత్తమ కథలు