హోమ్ /వార్తలు /సినిమా /

Faria Abdullah: స్టార్ హీరో సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు బ్యూటీ..?

Faria Abdullah: స్టార్ హీరో సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు బ్యూటీ..?

Faria Abdullah

Faria Abdullah

Faria Abdullah: అనుదీప్ కె.వి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగ అశ్విన్ నిర్మించగా.. కామెడీ ఎంటర్ టైన్ గా బాగా ఆకట్టుకుంది.

Faria Abdullah: అనుదీప్ కె.వి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగ అశ్విన్ నిర్మించగా.. కామెడీ ఎంటర్ టైన్ గా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించింది. ఈ ఏడాది మార్చి 11న విడుదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ తో మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా సెలబ్రిటీలను కూడా బాగా మెప్పించింది ఈ సినిమా. ఇందులో ఫరియా తన నటనతో ఎంతో సందడి చేసింది.

అంతేకాకుండా ఈ సినిమాలో కోర్టులో చేసిన సన్నివేశం మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తో ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ అందుకుంది. స్టార్ హీరో ప్రభాస్ ను కూడా తన హైట్ తో ఆశ్చర్యపరిచింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఫరియా అబ్దుల్లా. ఎప్పటికప్పుడు తన ఫోటోలతో, వీడియోలతో బాగా సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకుంది.

ఇప్పటికే పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా మరో స్టార్ హీరో సరసన నటించనున్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ డైరెక్టర్ జాతి రత్నాలు సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇందులో ఓ స్టార్ హీరో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బ్యూటీ నటించనున్న స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది.

First published:

Tags: Actor nithin, Faria Abdullah Age, Faria Abdullah Dance, Faria abdullah movie, Faria abdullah new, Faria abdullah next, Faria abdullah nithin, Hero Nithin

ఉత్తమ కథలు