• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD HEROINE ARRESTED IN DRUGS RACKET IN MUMBAI HOTEL AND HERE THE FULL DETAILS PK

Tollywood Drugs Racket: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. ముంబైలో హీరోయిన్ అరెస్ట్..

Tollywood Drugs Racket: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. ముంబైలో హీరోయిన్ అరెస్ట్..

టాలీవుడ్ డ్రగ్స్ కేసు

Tollywood Drugs Racket: ఎక్కడికి వెళ్లినా కూడా డ్రగ్స్ రాకెట్ మాత్రం సినిమా ఇండస్ట్రీని వదిలేయడం లేదు. ముఖ్యంగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ కుంభకోణం బయటికి వచ్చింది. తీగ లాగితే డొండ కదిలినట్లు ఎక్కడో..

  • Share this:
ఎక్కడికి వెళ్లినా కూడా డ్రగ్స్ రాకెట్ మాత్రం సినిమా ఇండస్ట్రీని వదిలేయడం లేదు. ముఖ్యంగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ కుంభకోణం బయటికి వచ్చింది. తీగ లాగితే డొండ కదిలినట్లు ఎక్కడో కదిలిన డ్రగ్స్ కేసు ఇంకెక్కడో తేలింది. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతుంది. తాజాగా ముంబైలో డ్రగ్స్ రాకెట్ సంచలనం సృష్టించింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబైలోని ఓ హోటల్‌పై దాడులు నిర్వహించింది. అక్కడ ఓ టాలీవుడ్ హీరోయిన్ పట్టుబడినట్లు ప్రచారం జరుగుతుంది. ముంబై మీరా రోడ్డు సమీపంలో ఉన్న హోటల్‌లో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేసారు అధికారులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ డ్రగ్స్ రాకెట్‌లో ఓ టాలీవుడ్ నటితో పాటు చాంద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి 400 గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ దాదాపు 10 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. డ్రగ్స్ సప్లయర్ సాయిద్ మాత్రం పరారీలో ఉన్నాడు. హిందీలో మొదలైన డ్రగ్స్ కేసు.. కన్నడలో కూడా బాగానే కదిలింది. అక్కడ సంజన, రాగిణి ద్వివేది లాంటి హీరోయిన్లను పోలీసులు అరెస్ట్ చేసారు కూడా.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood Drugs case)

మరోవైపు బాలీవుడ్‌లో కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అక్కడ కదిలిన డ్రగ్స్ లింక్ దీపిక పదుకొనే, సారా అలీఖాన్‌, రకుల్ ప్రీత్‌ సింగ్‌తో పాటు చాలా మందిని విచారించారు. ఇప్పుడు పట్టుబడింది కూడా ముంబైలోనే కావడంతో మరోసారి రచ్చ మొదలైంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు