Akkineni Nagarjuna - Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. అక్కినేని వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున తన నటనతో యువ సామ్రాట్ గా మారి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. వారసత్వంగా కాకుండా తన ట్యాలెంట్ తో స్టార్ హీరో గా నిలిచాడు నాగార్జున. నాటి నుండి నేటి వరకు సినిమాలలో నటిస్తూ.. ఈతరం హీరోయిన్ లతో కూడా నటిస్తున్నాడు నాగార్జున. 60 ఏళ్ళు వచ్చిన అదే స్థాయి నటనతో కన్నకొడుకులకు పోటీనిస్తున్నాడు ఈ గ్రీకువీరుడు. 6 పదుల వయసు మీద పడిన కూడా పాతికేళ్ళ కుర్రాడిగా కనిపించేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు అక్కినేని నాగార్జున.
ఇక ఇటీవలే అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ సినిమాలో నటించగా ఈ సినిమా అంతా సక్సెస్ ను అందుకోలేదు. ఇక ప్రస్తుతం మరో సినిమాలో బిజీగా ఉన్న నాగార్జున తన కుమారుడు నాగచైతన్య తో కలిసి నటిస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న సినిమా 'బంగార్రాజు'.
ఇక ఇందులో నాగార్జున, నాగ చైతన్య తాతా-మనవడు పాత్రల్లో కనిపించనున్నారట. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని ఇండస్ట్రీలో భారీ స్థాయిలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. అనుష్క స్పెషల్ సాంగ్ గురించి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.
నాగార్జున ద్విపాత్రలో నటించిన సినిమా సోగ్గాడే చిన్నినాయన. ఈ సినిమాలో నాగార్జున పాత్ర పేరు బంగార్రాజు. బంగార్రాజు పాత్రలో నాగార్జున నటన ఆకట్టుకోగా.. ఆ పాత్ర పేరు తోనే ఓ సినిమా చేయాలనుకున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. అంతేకాకుండా సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో అనుష్క ఓ పాత్రలో నటించగా అందులో ఓ స్పెషల్ సాంగ్ లో కూడా నటించి అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం బంగార్రాజు సినిమాల్లో కూడా అనుష్క స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని సమాచారం అందగా.. ఇప్పటి వరకు సినీ బృందం అధికారిక ప్రకటన చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Anushka Shetty, Bangaraju film, Special song, Tollywood, అక్కినేని నాగార్జున, అనుష్క, టాలీవుడ్