TOLLYWOOD HEROINE ANJALI NOT IN HURRY TO GET MARRIED NR
Heroine Anjali: నాకు ఆ మూడ్ లేదు.. ఇప్పుడే పెళ్లి చేసుకునేది లేదు!
Heroine Anjali
Heroine Anjali:టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి. ఈమె పరిచయం టాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలిసిందే. తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
Heroine Anjali:టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి. ఈమె పరిచయం టాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలిసిందే. తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తను నటించే పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది.
2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అంత గుర్తింపు అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం మళ్లీ పలు అవకాశాలు అందుకోగా తాజాగా ఈ ముద్దుగుమ్మ కు పెళ్లి చేసుకునే మూడ్ లేదట.
ప్రస్తుతం లాక్ డౌన్ లో కూడా సెలబ్రెటీలు పెళ్లిళ్లకు మళ్లీ ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీల పై పెళ్లిళ్ల ప్రశ్న ఎదురవగా తాజాగా అంజలి పెళ్లి గురించి టాక్ వినిపిస్తుంది. పైగా త్వరలోనే అంజలి పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి స్పందించిన ఆమె సన్నిహితులు అంజలికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే మూడ్ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంజలి దృష్టంతా సినిమాలపైనే ఉందని అన్నారు.
ఇక ఈ బ్యూటీ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో ఆనందభైరవి అనే సినిమాలో అవకాశం వచ్చిందని తెలియగా.. తమిళం, కన్నడ, మలయాళ భాషలో వరుస సినిమాలలో బిజీగా ఉందట. అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కనున్న ఎఫ్3 సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో రెండు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయని తెలుస్తుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.