TOLLYWOOD HEROINE ANJALI COMMENTS ON HEROINE OFFERS IN MOVIES NR
Heroine Anjali: ఆ హీరోయిన్స్ వల్ల నాకు అవకాశాలు పోలేదు.. అంజలి!
Heroine Anjali
Heroine Anjali: టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు అందుకుంది. తాను నటించే సినిమాలలో పాత్రకు ప్రాణం పోసినట్టుగా నటిస్తుంది.
Heroine Anjali: టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు అందుకుంది. తాను నటించే సినిమాలలో పాత్రకు ప్రాణం పోసినట్టుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషలలో కూడా నటించింది అంజలి. తెలుగు అమ్మాయి ఐనా అంజలి తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం అంత గుర్తింపు అందుకోలేదు.
2006లో ఫోటో సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. ఇక అక్కడే వరుస సినిమాలలో సెటిలైన ఈ బ్యూటీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించగా తన పాత్రతో బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతుంటే పాత హీరోయిన్స్ కు అవకాశాలు దూరమవుతాయి. ఇలా చాలామంది హీరోయిన్ కొత్త వాళ్లు వచ్చాక అవకాశాలు అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయం గురించి అంజలి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి కొన్ని విషయాలు తెలిపింది. కొత్త హీరోయిన్స్ రావడం వల్ల పాత హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గుతాయన్న అపోహలు తాను విశ్వసించనని తెలిపింది. నిర్మాతలు తమ సినిమాలకు కావలసిన పాత్రకు ఎవరు సరిగ్గా సెట్ అవుతారో వాళ్లనే ఎంచుకుంటారని అంటుంది. ఒకరి ఆఫర్స్ మరొకరు లాక్కునే అవకాశం ఉండదని, వేరే వారి పాత్రను తాము చేస్తే బాగుండేది అని ఎప్పుడు అనుకోనని తెలిపింది. వచ్చిన అవకాశాలకు పూర్తి న్యాయం చేసేందుకు తను తెగ ప్రయత్నిస్తానని అంటుంది అంజలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో ఆనందభైరవి అనే సినిమాలో అవకాశాన్ని అందుకుందని తెలిసింది. ఇక తమిళం, కన్నడ, మలయాళం భాషలో వరుస సినిమాల్లో బిజీగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కనున్న ఎఫ్ 3 లో కూడా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. అంతే కాకుండా మరో రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని తెలుస్తుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.