హోమ్ /వార్తలు /సినిమా /

Akkineni Samantha: నవంబర్ నుంచి సమంత కొత్త ప్రయాణం.. ఆ విషయం కన్ఫామ్ చేసేసిందా?

Akkineni Samantha: నవంబర్ నుంచి సమంత కొత్త ప్రయాణం.. ఆ విషయం కన్ఫామ్ చేసేసిందా?

Akkineni Samantha

Akkineni Samantha

Akkineni Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ఈ మధ్య తరుచుగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. గత కొన్ని రోజుల నుండి అక్కినేని కుటుంబంతో సమంతకు గొడవలు ఉన్నాయని అంతేకాకుండా అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందని బాగా పుకార్లు వినిపించాయి.

ఇంకా చదవండి ...

  Akkineni Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ఈ మధ్య తరుచుగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. గత కొన్ని రోజుల నుండి అక్కినేని కుటుంబంతో సమంతకు గొడవలు ఉన్నాయని అంతేకాకుండా అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందని బాగా పుకార్లు వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి రిపోర్టర్ పై ఫైర్ అయ్యింది సమంత.

  టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకున్న సమంత అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత మరింత సక్సెస్ లు అందుకుంది. పెళ్లి తర్వాత వరుస సినిమాలలో బాగా అవకాశాలు అందుకుంది. ఇక పలు బిజినెస్ లలో కూడా బాగా బిజీగా ఉంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. నిత్యం ట్రెండ్ ను ఫాలో అవుతుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట సమంత తన సోషల్ మీడియా వేదికలో అక్కినేని పేరును తొలగించినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది.

  సమంత అక్కినేని పేరు ఎందుకు తొలగించిందని.. ఇంత సడన్ గా తను ఆ పేరుని ఎందుకు తీసేసిందని బాగా వార్తలు వినిపించాయి. ఇక కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా వీరిద్దరి మధ్య విడాకుల చర్చలు జరుగుతున్నాయని ఒక్క పుకారు వినిపించేసరికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పాకింది. ఇక విడాకుల గురించి ఎన్ని వార్తలు వినిపించినా కూడా సమంత గాని, నాగచైతన్య గాని స్పందించకపోవడంతో ఇందులో నిజమే ఉందని అనుకున్నారు నెటిజన్లు.

  ఇది కూడా చదవండి:సమంత నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్.. చెయ్యి మొత్తం పచ్చబొట్లు.. సామ్ ఏం చేసిందంటే?


  గతంలో నాగార్జున బర్త్ డే వేడుకల్లో కూడా సమంత కనిపించకపోయేసరికి అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. తర్వాత సమంత హ్యాపీ బర్త్డే మామ అనే చెప్పేసరికి వారి మధ్య బ్రేకప్ అనేది పుకార్ అని తెలిసింది. ఇక మళ్లీ విడాకుల గురించి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారగా సమంత ఏ మాత్రం స్పందించలేదు. ఇటీవలే నాగ చైతన్య చేసిన ట్వీట్ కు సమంత స్పందించగా మధ్య ఎటువంటి బ్రేకప్ లేదని క్లారిటీ వచ్చింది. కానీ తాజాగా నెటిజన్లకు మళ్లీ అనుమానాలు ఎదురయ్యాయి.

  ఇది కూడా చూడండి:పెళ్లికూతురు చీరలో అక్కినేని సమంత.. ఈ అందాలు పొగడతరమా

  సమంత తాజాగా నాగచైతన్య లేకుండా ఒంటరిగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇక దర్శనం అనంతరం ఆలయ అధికారులతో ఉన్న సమయంలో ఓ రిపోర్టర్ వచ్చి ఫోటో అని అడిగాడు. దీంతో సమంత.. గుడికి వచ్చి.. బుద్ధుందా అంటూ ఫైర్ అయ్యింది. ఈ మాటలు విన్న నెటిజెన్లు సమంతను బాగా విమర్శిస్తున్నారు. ఇదివరకు ఎక్కడ ఫోటో దిగలేదా అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరు తనను మీడియావాళ్లు నాగచైతన్య గురించి ప్రశ్నిస్తారేమో అని అందుకే సమాధానం చెప్పలేక తిట్టి పంపించింది అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలము సినిమా పూర్తి చేయగా.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పిందట. ఇక ఈ కొత్త సినిమా ప్రయాణం నవంబర్ నుండే ప్రారంభం కానుందని తెలుస్తుంది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Akkineni samantha, Naga Chaitanya, Tollywood

  ఉత్తమ కథలు