Adah Sharma: టాలీవుడ్, బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆదా శర్మ. తన అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచింది. ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ, భాషల్లో కూడా తన నటన ను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ.
2008లో బాలీవుడ్ లో హారర్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాతో తన నటన వల్ల ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత 2014లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిసారిగా పరిచయం అయింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న కూడా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఈ బ్యూటీ. ఇక అక్కడి నుండి మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టింది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా బుల్లితెరలో కూడా పలు వాణిజ్య పరమైన ప్రకటనలు కూడా చేసింది. ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అందులో ఆదా శర్మ మదర్స్ డే సందర్భంగా ఓ డాన్స్ విన్యాసాలతో బాగా ఆకట్టుకుంది. కానీ అందులో తను చేసిన క్రియేటివిటీ మాత్రం బాగా అదిరిపోయింది. తన తల్లితో కలిసి చేసిన ఆ క్రియేటివిటీని చూసి అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.