ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటూ ఫోన్.. ముంబైలో కిడ్నాప్..

Prabhas kriti Garg | తాజాగా ప్రభాస్ సరసన కథానాయికగా ఛాన్స్ అంటూ ‘రాహు’ సినిమా ఫేమ్ కృతి గార్గ్‌కు అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి ఫోన్ చేసినట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. ఆమెను ఆడిషన్ కోసం ముంబై రమ్మన్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 2, 2020, 4:06 PM IST
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటూ ఫోన్.. ముంబైలో కిడ్నాప్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ క్రేజ్ ఆకాశమంత పెరిగింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘సాహో’ తెలుగులో అంతగా వర్కౌట్ కాకపోయినా.. హిందీలో దాదాపు రూ.200 కోట్ల వరకు కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. దీంతో ప్రభాస్ సినిమా అంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. అలాంటి ఇమేజ్ ఉన్న ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. తాజాగా ప్రభాస్ సరసన కథానాయికగా ఛాన్స్ అంటూ ‘రాహు’ సినిమా ఫేమ్ కృతి గార్గ్‌కు అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి ఫోన్ చేసినట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. ఆమెను ఆడిషన్ కోసం ముంబై రమ్మన్నాడు. దీంతో ఈ  హీరోయిన్‌ పట్టలేని ఆనందంతో తనకు ఫోన్ చేసింది సందీప్ రెడ్డినా కాదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండానే ముంబై వెళ్లింది. వెళ్లే ముందు తనకు  ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందంటూ..తనకు తెలిసిన వాళ్లకు చెప్పి.. ముంబై వెళ్లింది.

tollywood heroin kriti garg got cheating call from mumbai in the name of prabhas sandeep reddy movie chance,ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటూ ఫోన్.. ముంబైలో కిడ్నాప్..,kriti garg kidnap,prabhas kriti garg,rahu heroin kriti garg,prabhas sandeep reddy vanga kriti garg,prabhas tollywood heroin got cheating call,prabhas krith garg,prabhas sandeep reddy vanga,prabhas kriti garg,prabhas nag ashwin,tollywood,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కృతి గార్గ్,ప్రభాస్ కృతి గార్గ్,ప్రభాస్ సందీప్ రెడ్డి కృతి గార్గ్,కృతి గార్గ్ కిడ్నాప్
ప్రభాస్,కృతి గార్గ్,సందీప్ రెడ్డి వంగా (Twitter/Photos)


తీరా ఆమె ముంబై వెళ్లిన తర్వాత సదరు కృతి గార్గ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్టు వస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. అయితే ఈ విషయమై రాహు సినిమా దర్శకుడు సుబ్బు పంజాగుట్ట పోలీసులకు కంప్లైట్ చేసాడు. ఇపుడు విషయం టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
Published by: Kiran Kumar Thanjavur
First published: March 2, 2020, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading