హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood Heroes Wives: ఈ హీరోల భార్యలు వారికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎలానో తెలుసా?

Tollywood Heroes Wives: ఈ హీరోల భార్యలు వారికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.. ఎలానో తెలుసా?

Tollywood Heroes Wives

Tollywood Heroes Wives

Tollywood Heroes Wives:ఒకప్పుడు సినిమాలలో నటించే హీరోలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వారి భార్యలు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ అందరిలోనూ మార్పులు వస్తున్నాయి.


Tollywood Heroes Wives:ఒకప్పుడు సినిమాలలో నటించే హీరోలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వారి భార్యలు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ అందరిలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో తన భర్త ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ వారి భార్యలు కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ చేయడం లేదా ఏ రంగంలోనైనా స్థిరపడి డబ్బులను సంపాదించటం మొదలు పెట్టారు.ఈ విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోల భార్యలు వారి కన్నా అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. మరి ఆ హీరోలు ఎవరు వారి బార్యలు ఏం చేస్తున్నారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...


నాచురల్ స్టార్ నానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని అంజనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. నాని సినిమాలతో బిజీగా ఉంటే తన భార్య అంజనా కూడా బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్ గా శిక్షణ తీసుకొని రాజమౌళి ఆర్కా మీడియాలో జాయిన్ అయ్యి క్రియేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ గా పని చేస్తూ నాని కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నారు.


మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసిందే.ఈమె అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొని ఎంతో మందికి సహాయ సహకారాలను చేస్తుంటారు.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారని మనకు తెలిసిందే. అదేవిధంగా స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి కీప్ చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అలాగే తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ బాధ్యతలను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.




హీరో అల్లరి నరేష్ భార్య విరూప ప్రత్యేక సోషల్ మీడియాలో లేకున్నప్పటికీ తన భర్త కన్నా అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తుందని చెప్పవచ్చు. విరూప ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది. ఈమె ఒక ఈవెంట్ చేస్తే లక్షల్లో తీసుకుంటూ నరేష్ కన్నా ఎక్కువగా సంపాదిస్తుందని చెప్పవచ్చు.



నటుడు రాహుల్ రవీంద్ర భార్య సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీలో సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉంటూ తన భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తుందని చెప్పవచ్చు.


యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతున్న సుమ యాంకరింగ్ మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తన భర్త రాజీవ్ కనకాల కన్నా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు.


నాగచైతన్య - సమంత: టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ అక్కినేని సమంత, నాగచైతన్య గురించి ఇటీవల కొన్ని గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అది అంత నిజం కాదని ఒక్క ట్విట్ తో సమంత కొట్టి పడేసిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య కంటే ప్రస్తుతం సమంతనే ఎక్కువ సంపాదిస్తుందట. ప్రస్తుతం సమంత సినిమాలు మాత్రమే కాకుండా సొంత క్లాత్ స్టోర్ రన్ చేస్తూ, పెయిడ్ ప్రేమోషన్స్ భారీగా చేస్తూ లాక్ డౌన్ లో కూడా భారీగా సంపాదించింది సమంత.

First published:

Tags: Anchor suma, Chinmayi Sripada, Nani anjana, Sneha reddy, Tollywood, Upasana konidela, Virupa

ఉత్తమ కథలు