Home /News /movies /

వెండితెర రాముడు.. శ్రీ రాముని పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు..

వెండితెర రాముడు.. శ్రీ రాముని పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు..

వెండితెర పై రాముని పాత్రలో నటించిన తెలుగు హీరోలు (Facebook/Photos)

వెండితెర పై రాముని పాత్రలో నటించిన తెలుగు హీరోలు (Facebook/Photos)

నిద్రాహారాల్లేకుండా బతకొచ్చేమోగానీ భారతదేశంలో రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. రాముడు మంచి బాలుడు అన్న సామెత ఇందులోనిదే. అలాంటి రాముడికి తెలుగు సిన్మాకు అవినాభావ సంబంధం వుంది. రాముని అవతారం ఎంతో ఉన్నతమైనది. ఆ అవతారంలో ఎన్నో మానవీయ విలువలు. మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు..కుటుంబ వ్యవస్థలోని అనుబంధాలు రామాయణం చూస్తే అర్థమవుతుంది. ఇగ మనతెలుగు సిన్మాల్లో రాముడికి ప్రత్యేక స్థానం వుంది.అలాంటి మహోన్నత పాత్రను నటించి మెప్పించిన నటులెవరో చూద్దాం. తింటే గారాలే తినాలి. వింటే భారతం వినాలి. కంటే రామాయణం కనాలన్న సూత్రాన్ని ఫాలో కావడం భారతీయులకున్న అలవాట్లలో కొన్ని. అందునా తెలుగువాళ్లకు రాముడంటే వల్లమాలిన అభిమానం. అలనాటి ‘లవకుశ’ నుంచి నేటి ‘శ్రీరామరాజ్యం’ వరకు రామగాధను గానం చేసినవే. రాముడి గొప్పతనాన్ని తెలిపినవే.

అసలు తెలుగు సిన్మా పౌరాణికాలతో ప్రారంభమయింది. రామకథతో వచ్చిన తొలి సిన్మా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ తొలిసారి రాముని పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కొంత మంది నటులు రాముని పాత్రలో కనిపించిన...తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇప్పటికే రాముడంటే ఎన్టీఆరే.

Tollywood Heroes who played lord sri rama charecters in telugu movies
వెండితెర శ్రీరాముడు


వెండితెర శ్రీరాముడిగా ప్రశంసలు అందుకుని రాముడంటే ఇలాగే ఉంటాడా....అనిపించే స్థాయిలో నటించిన ఘనత ఎన్.టి.ఆర్ కే దక్కుతుంది.అసలు రామచంద్రుడి క్యారెక్టర్ చాలా ఉన్నతమైనది. ఆ పాత్రలో ఓ స్వచ్చత, ఓ సచ్చీలత, ఓ శాంత గుణం కనిపించాలి. శ్రీరాముడి పాత్రకు ఏ మేరకు నటించాలో అంతగా నటించి అద్భుతం అనిపించారు ఎన్టీఆర్. సీతా వియోగ ఘట్టంలో విషాదాన్ని, రావణ సంహారంలో కోపాన్ని, మహారాజుగా శాంతాన్ని ఇలా నవరసాలను మేలవించి శ్రీరాముడి పాత్రలో లీనమై నటించారు ఎన్టీఆర్.

రామో విగ్రహవాన్ ధర్మహ: అన్న ఆర్యోక్తి శత్రువు సైతంరాముడి గొప్పదనాలను తెలిపేవే. ఇక ఎన్టీఆర్ తర్వాత రాముడుగా మెప్పించిన నటుడు హరినాథ్. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామకళ్యాణం’  సినిమాతో పాటు మరో ‘శ్రీరామకథ’లో హరనాథ్ కోదండ రాముడిగా మెప్పించాడు.

Tollywood Heroes who played lord sri rama charecters in telugu movies
హరనాథ్


‘లవకుశ’ సిన్మాలో లక్ష్మణుడిగా మెప్పించిన కాంతారావు...‘వీరాంజనేయ’తో పాటు తదితర కొన్ని సిన్మాల్లో రాముడిగా నటించి మెప్పించారు. ఇక రామారావు, కాంతారావు కంటే ముందే ఏఎన్నాఆర్ ఆయన నటజీవితాన్ని ‘సీతారామ జననం’ సినిమాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం.

Tollywood Heroes who played lord sri rama charecters in telugu movies
శ్రీసీతారామ జననం


ఇక రాముడిగా శోభన్ బాబుది ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత  ‘సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబుకే చెల్లింది. ఈసినిమాలో రామయ్య తండ్రీ...ఓ రామయ్య తండ్రీ...మా సామీ వంటి నీవేలే రామయ్య తండ్రీ...అంటూ వచ్చే  పాట ఇప్పటికీ తెలుగువారి మదిలో దేవుడిగా రాముని ఔన్నత్యాన్ని తెలుపుతునే వుంది.

Tollywood Heroes who played lord sri rama charecters in telugu movies
సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు


శోభన్ బాబు తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మరో రామాయణ గాధ ‘సీతా కళ్యాణం’ ఈ చిత్రంలో జయప్రద సీతగా నటిస్తే...మలయాళ నటుడు రవి శ్రీరాముడిగా మెప్పించాడు. ఉత్తారాది వాళ్లకు అయోధ్య ఎలాగో...దక్షిణాది వారికి భద్రాచలం అంతే. ఇగ భద్రాచలం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో సిన్మాలు వెండితెరను రామమయం చేశాయి. ఇదే భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీరామదాసు సిన్మాలో సుమన్ శ్రీరాముడిగా అలరించాడు.

Tollywood Heroes who played lord sri rama charecters in telugu movies
శ్రీరామదాసులో సుమన్


రామాయణం అంటే రాముడి నడిచిన మార్గం అనే అర్థం వుంది. తండ్రి మాట కోసం రాముడు వనవాసం చేశాడు. ఇంతలో సతాపహరణం జరిగింది. రావణ సంహారం చేసి సీతను కైవసం చేసుకుంటాడు రాముడు. ఇదీ మూడు ముక్కల్లో రామాయణం. ఇగ నవతరం నాయకుల్లో శ్రీకాంత్ ‘దేవుళ్లు’ సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించడం విశేషం.

ఇగ రామాయణం పై వచ్చిన మరో అద్భుత వెండితెర దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’. లవకుశ సినిమాకు రీమేక్ గా తీసిన ఈసిన్మాలో శ్రీరాముడిగా బాలకృష్ణ అద్భుతాభినయం చేసారు. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో సాత్వికాభినయం చేసి మెప్పించారు.

Tollywood Heroes who played lord sri rama charecters in telugu movies
బాలకృష్ణ


ఇక నందమూరి మూడో నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్..ఆయన నటజీవితాన్ని రామాయణం సిన్మాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషమనే చెప్పాలె. ఇలా మూడు తరాల హీరోలు వెండితెర రాముడిగా మెప్పించడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలె.

Tollywood Heroes who played lord sri rama charecters in telugu movies
రామాయణంలో రాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్


అప్పటి వాళ్లకే కాదు. ఇప్పటి వాళ్లు కూడా రాముడు గొప్పవాడని ఒప్పుకుంటారు. రాముడిది ఒకే మాట. ఒకే బాణం..ఒకే భార్య ...ఒకే విధానం. ప్రెజెంట్ సొసైటీ వెళ్తున్న మార్గాన్ని అనుసరించి చెబితే...రాముడి వ్యక్తిత్వం సమాజానికి ఎంతో అవసరం. ఇదీ వెండితెరపై తెలుగు రాముడి లీల. మరోసారి న్యూస్ 18 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షాలు.
 
First published:

Tags: Balakrishna, Jr ntr, NTR, Shobhan Babu, Sri rama navami 2019, Srikanth, Suman, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు