బాలయ్య ఇలా.. పవన్ అలా.. అభిమానులు విల విల..

అవును తెలుగు హీరోలైన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ‌లను చూసి వాళ్ల అభిమానులు కన్ఫ్యూజన్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: March 22, 2020, 12:26 PM IST
బాలయ్య ఇలా.. పవన్ అలా.. అభిమానులు విల విల..
బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (Twitter/Photos)
  • Share this:
అవును తెలుగు హీరోలైన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ‌లను చూసి వాళ్ల అభిమానులు కన్ఫ్యూజన్ అవుతున్నారు. బాలకృష్ణ విషయానికొస్తే.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత పాలిటిక్స్ కంటే వరసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. కానీ అభిమానులు కార్యకర్తలు మాత్రం ఆయనకు ఓట్లేసిన గెలిపించి వాళ్లను పట్టించుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే బాలయ్య.. హిందూపూర్ నియోజకవర్గంలో తన మనిషిని పెట్టి అక్కడ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఆయన కనీసం నెలలో రెండు సార్లైనా వచ్చి నియోజకవర్గ సమస్యలను పట్టించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో టీడీపీలో ఆయనకు సన్నిహితంగా మెలిగిన చాలా మంది నేతలు వైసీపీలో జాయిన్ అయిన బాలయ్య మాత్రం కిమ్మనకుండా ఉండటాన్ని తప్పుపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆయన రాజకీయంగా కీలకంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ బాలయ్య మాత్రం సినిమాలు తప్పించి రాజకీయాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tollywood heroes balakrishna pawan kalyan confused his fans due to this way,balakrishna,pawan kalyan,balarishna pawan kalyan,balayya,nbk,chiranjeevi,chiru,balakrishna politics,pawan kalyan politics,balakrishna not interested politics,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan twitter,balarkrishna facebook,balakrishna instagram,balakrishna twitter,balakrishna boyapati srinu movie,pawan kalyan vakeel saab movie,tollywood,andhra pradesh news,pawan kalyna janasena,pawan kalyan balakrishna janasena tdp,balakrishna tdp,chiranjeevi praja rajyam,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్,బాలయ్య,పవన్ కళ్యాణ్ జనసేన,బాలకృష్ణ టీడీపీ,Tollywood heroes balakrishna pawan kalyan confused his fans due to this way,balakrishna,pawan kalyan,balarishna pawan kalyan,balayya,nbk,chiranjeevi,chiru,balakrishna politics,pawan kalyan politics,balakrishna not interested politics,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan twitter,balarkrishna facebook,balakrishna instagram,balakrishna twitter,balakrishna boyapati srinu movie,pawan kalyan vakeel saab movie,tollywood,andhra pradesh news,pawan kalyna janasena,pawan kalyan balakrishna janasena tdp,balakrishna tdp,chiranjeevi praja rajyam,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్,బాలయ్య,పవన్ కళ్యాణ్ జనసేన,బాలకృష్ణ టీడీపీ,
నందమూరి బాలకృష్ణ


ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో వెళ్లిన తర్వాత సినిమాలు చేయనని ఖరాఖండీగా చెప్పారు. కానీ ఏపీలో రాజకీయాల్లో ఇంకా ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు టైమ్ ఉండటంతో అప్పటి వరకు పార్టీని బతికించుకోవడానికి తనకు సినిమాల్లో నటించడం తప్ప వేరే ఏ మార్గం తెలియదని చెప్పి వరుసగా సినిమాల్లో నటించడానికి కమిట్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్, డాలీ, బాబీ వంటి వాళ్లను లైన్‌లో పెట్టాడు.

Tollywood heroes balakrishna pawan kalyan confused his fans due to this way,balakrishna,pawan kalyan,balarishna pawan kalyan,balayya,nbk,chiranjeevi,chiru,balakrishna politics,pawan kalyan politics,balakrishna not interested politics,pawan kalyan instagram,pawan kalyan facebook,pawan kalyan twitter,balarkrishna facebook,balakrishna instagram,balakrishna twitter,balakrishna boyapati srinu movie,pawan kalyan vakeel saab movie,tollywood,andhra pradesh news,pawan kalyna janasena,pawan kalyan balakrishna janasena tdp,balakrishna tdp,chiranjeevi praja rajyam,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్,బాలకృష్ణ పవన్ కళ్యాణ్,బాలయ్య,పవన్ కళ్యాణ్ జనసేన,బాలకృష్ణ టీడీపీ,
పవన్ కళ్యాణ్


మొత్తానికి  పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు వెచ్చించకుండా సినిమాలకు కేటాయించడాన్ని ఆయనను రాజకీయంగా ఇష్టపడే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. వేరే హీరోల అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్‌కు రాజకీయ స్థిరత్వం లేదని మాట్లాడుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవికి రాజకీయంగా కాస్త క్లారిటీ ఉందని చెబుతున్నారు. ఆయన పాలిటిక్స్‌ను పూర్తిగా పక్కనపెట్టేసి తన దృష్టిని సినిమాలవైపు నిలబడ్డాడని చెవులు కొరక్కుంటున్నారు. చిరంజీవికి కూడా రాజకీయాల్లో వచ్చి ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు. కానీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన కేంద్ర మంత్రి పదవి మాత్రం దక్కించుకోగలిగారు. ఇపుడు మాత్రం సినిమాలే లోకంగా బతుకుతున్నాడు.  మొత్తంగా చూసుకుంటే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లు సినిమాలే కాకుండా ఇప్పటికైనా రాజకీయంగా మరింత క్రియా శీలకంగా మారాలని అభిమానులు పార్టీ కార్యకర్తలు కోరకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 22, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading