హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్ స్టెప్పులు వేయబోయి గాయాల పాలైన విశాల్..

ఎన్టీఆర్ స్టెప్పులు వేయబోయి గాయాల పాలైన విశాల్..

విశాల్, ఎన్టీఆర్

విశాల్, ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మంచి విజయం సాధించింది. తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ఈసినిమాలో ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్న సమయంలో హీరో విశాల్‌కు గాయాలపాలైయ్యాడు.

ఇంకా చదవండి ...

  జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మంచి విజయం సాధించింది.  ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరీర్ మాత్రం ర‌య్యిమంటూ పైకి లేచింది. వ‌ర‌స విజ‌యాల‌తో దుమ్ము దులిపేస్తున్నాడు ఈ హీరో. ఇక ఈ చిత్రాన్ని వ‌ర‌స‌గా ప‌లు భాష‌ల్లో రీమేక్ చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే హిందీలో ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. అక్క‌డ ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెర‌కెక్కిస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈసినిమాలో ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్న సమయంలో హీరో విశాల్‌కు గాయాలపాలైయ్యాడు.


  ఓ కష్టమైన స్టెప్పుకు డాన్స్ మూమెంట్స్ చేస్తోన్న సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ప్రమాదంలో విశాల్ మోచేతికి, కాలికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విశాల్ అభిమానులు ఆందోళనకు గురువుతున్నారు.

  First published:

  Tags: Jr ntr, Kollywood, NTR, Tollywood, Vishal

  ఉత్తమ కథలు