Vijay Devarakonda: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలతో బాగా బిజీగా మారాడు. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ ను అందుకున్నాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అంతేకాకుండా స్టార్ హీరోగా కూడా నిలిచాడు. ఇక నిర్మాతగా కూడా బాధ్యతలు చేపడుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు విజయ్.
ఇక ఈయనకు లేడీ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది. అంతేకాకుండా హీరోయిన్స్ కూడా ఈయన అంటే ఎంతో అభిమానం. ఇప్పటికే ఈయన స్టైల్ ను చూసి మనసు పారేసుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. బాలీవుడ్ లో అలియాభట్, శ్రద్ధా కపూర్ తో పాటు పలువురు హీరోయిన్స్ విజయ్ దేవరకొండ తమ అభిమాన హీరోగా చెప్పుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా విజయ్ తో బాగా సన్నిహితంగా కనిపించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు..
అర్జున్ రెడ్డి రీమేక్ తో హిందీలో తెరకెక్కిన కబీర్ సింగ్ హీరోయిన్ కియారా అద్వానీ. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ పై తన ఇష్టాన్ని పరిచయం చేసింది. తాజాగా వీరిద్దరూ గోవా బీచ్ లో దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఇందులో కియారా గ్లామర్ లుక్ లో కనిపించగా, విజయ్ దేవరకొండ మాత్రం ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపించాడు. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సో సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాతలు కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛార్మీ లు నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Goa beach, Kiara advani, Tollywood, Vijay devarkonda