Home /News /movies /

TOLLYWOOD HERO TRAPPED IN SNOWY MOUNTAINS AND THE FILM UNIT IS TENSED MHN

BellamKonda Sai Srinivas: మంచు కొండ‌ల్లో చిక్కుకున్న హీరో.. టెన్ష‌న్‌లో చిత్ర‌యూనిట్

Tollywood hero trapped in snowy mountains and the film unit is tensed

Tollywood hero trapped in snowy mountains and the film unit is tensed

BellamKonda Sai Srinivas - Alludu Adhurs: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం అల్లుడు అదుర్స్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ యూనిట్ అక్కడ మంచు వర్షం కారణంగా మంచులో చిక్కుకుపోయింది.

    సంక్రాంతికి ఏయే సినిమాలు వ‌స్తున్నాయి అని ఎవ‌రినైనా అడిగితే వ‌కీల్‌సాబ్ రావ‌డం లేదు అని ఎంత గ‌ట్టిగా చెబుతారో, రెడ్‌, క్రాక్‌, అల్లుడు అదుర్స్ వ‌స్తున్నాయ‌ని కూడా అంతే గ‌ట్టిగా చెబుతారు. మ‌రి రెడ్‌, క్రాక్ రావ‌డంలో అనుమానం లేదు. కానీ అల్లుడు అదుర్స్ నిజంగానే వ‌స్తుందా? అనేది ఇప్పుడు చాలా మందికి వ‌స్తున్న డౌట‌నుమానం. చివ‌రి నిమిషంలో ఆ అనుమానం ఎందుకు వ‌చ్చింద‌నేగా మీ అనుమానం... ఆల్రెడీ రామ్‌కి సంబంధించిన రెడ్ ప్ర‌మోష‌న్స్ పీక్స్ లో న‌డుస్తున్నాయి. ఎప్పుడూ ప్ర‌మోష‌న్ల‌లో వెనుకుండే ర‌వితేజ కూడా మొన్నీమ‌ధ్య‌నే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టుకున్నారు. మ‌రోవైపు చెన్నై నుంచి వ‌చ్చే విజ‌య్ కూడా గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌కి వెన్యూ ఫిక్స్ చేసుకున్నారు.

    మ‌రి సంక్రాంతికి బ‌రిలోకి దూకే పందెంకోళ్ల‌న్నీ ప్ర‌మోష‌న్ల మీద వేగం పెంచేస్తుంటే బెల్లంబాబు ఎక్క‌డ‌? ఇప్పుడు అంద‌రూ ఈ విష‌యాన్నే ఆరా తీస్తున్నారు. రీసెంట్‌గా ఓ సాంగ్ షూట్ కోసం కాశ్మీర్ వెళ్లిన బెల్లంకొండ శ్రీను అక్క‌డే ఇరుక్కుపోయార‌ట‌. ఆయ‌న ఒక్క‌డే కాదు, ఆయ‌న‌తో పాటు హీరోయిన్ కూడా అక్క‌డే ఉంద‌ట‌. అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కి వ‌ద్దామంటే ఫ్లైట్ల‌న్నీ కేన్సిల్ అయ్యాయ‌ట‌. సో ఇప్పుడు ప్ర‌మోష‌న్ల‌లో కూడా పార్టిసిపేట్ చేయ‌లేని సిట్చువేష‌న్‌. మ‌రోవైపు సినిమా ఇంకా ఫ‌స్ట్ కాపీ కాలేద‌నే టాక్ కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది.

    అటు క్రాక్‌, ఇటు రెడ్ త‌మ సినిమాల సెన్సార్ కాపీల‌ను కూడా ప్ర‌మోష‌న్ల‌లో వాడుకుంటుంటే, ఇంకా అల్లుడు అదుర్స్ ఫైన‌ల్ మిక్సింగ్ కాలేద‌నే టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. ఈ లాస్ట్ మినిట్ టెన్ష‌న్స్ వ‌ల్ల సినిమా ఔట్‌పుట్ మీద కూడా చాలా డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. అస‌లే బాలీవుడ్‌లో అడుగుపెట్టాల్సిన హీరో... ఇప్పుడు ఇన్ని టెన్ష‌న్స్ అవ‌స‌ర‌మా బాబూ అని అంటున్నార‌ట బెల్లం కాంపౌండ్ వెల్ విష‌ర్స్.
    Published by:Anil
    First published:

    Tags: Alludu Adhurs, Bellamkonda Sreenivas, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు