news18-telugu
Updated: April 13, 2020, 4:24 PM IST
పోలీసులకు హీరో శ్రీకాంత్ సాయం (Twitter/Photo)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఎక్కడి ప్రజలు అక్కడే ఉంటే ఈ వైరస్ను కట్టడి చేయోచ్చని ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ లాక్డౌన్ కారణంగా రోజువారీ కార్మికులకు పనిలేకుండా పోయింది. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తన వంతు సాయం చేస్తోంది. ఇక సినిమా వాళ్లు తమ వంతుగా ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా సినీ కార్మికులకు పనిలేకుండా పోయింది. ఆ పేద కళాకారులను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. ఈ ఛారిటీ కోసం హీరో శ్రీకాంత్ తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందజేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా శ్రీకాంత్.. రాయదుర్గం పోలీసులకు శాటిటైజర్లు, ఆహారాన్ని అందించి తన వంతు ఉదారతను చాటుకున్నారు. అంతేకాదు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

పోలీసులకు హీరో శ్రీకాంత్ సాయం (Twitter/Photo)
ప్రస్తుతం శ్రీకాంత్ నటించిన ‘చదరంగం’ వెబ్ సిరీస్ అలరిస్తోంది. అన్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తీసారు. ఇందులో శ్రీకాంత్.. గంగాధర్ అనే నటుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడనే నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్లో శ్రీకాంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ను మంచు విష్ణు నిర్మించాడు. మరోవైపు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో విలన్గా యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
April 13, 2020, 4:24 PM IST