Home /News /movies /

TOLLYWOOD HERO SRI VISHNU ALLURI MOVIE FIRST POSTER RELEASE SB

అల్లూరి టైటిల్‌తో వస్తున్న యంగ్ హీరో.. ఇప్పటివరకు చేయని పాత్రలో శ్రీవిష్ణు

అల్లూరి పోస్టర్ రిలీజ్

అల్లూరి పోస్టర్ రిలీజ్

హీరో శ్రీవిష్ను.. భిన్నమైన పాత్రలు చేస్తూ వస్తారు.సీరియస్‌గా, కామెడీగా కూడా నటించి అభిమానుల మన్ననలు అందుకున్నారు. తాజాగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించున్నాడు.

    హీరో శ్రీ విష్ణు.. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక హీరోలతో కూడా ఆయన కలిసి పనిచేశారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ.. పలు సినిమాలు కూడా చేస్తున్నారు. అతను ఎంచుకున్న సినిమాలు, కథలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. తాజాగా శ్రీవిష్ణు చేస్తున్న కొత్త సినిమా అల్లూరి. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఇందులో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ‘అల్లూరి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ప్రకటించారు నిర్మాతలు. ‘గ్రేటెస్ట్ పోలీస్ స్టోరీ ఎవర్ టోల్డ్’ అని మెన్షన్ చేస్తూ ఖాకీ యూనిఫామ్‌లో డార్క్ షేడ్ తో ఉన్న శ్రీవిష్ణు పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

    విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యమైన కథాంశాలతో, అభినయానికి అవకాశం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. గత చిత్రం ‘అర్జున ఫల్గుణ’ అంతగా ఆడలేదు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ‘భళాతందనాన’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్న శ్రీవిష్ణు తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఇందులో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ‘అల్లూరి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ప్రకటించారు నిర్మాతలు.

    అయితే ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో శ్రీవిష్ణు... దొంగలా,క్రిమినల్,లవర్‌గా, ఓ మంచి ఫ్రెండ్‌గా నటించారు. కాని తొలిసారి తన కెరీర్‌లోగా పోలీస్ వేషం వేస్తూండడంతో సినిమాపై ఆసక్తి, భారీ అంచనాలు నెలకొన్నాయి. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాదే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి అల్లూరిగా, ఓ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీవిష్ణు యాక్టింగ్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతుందో చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Tollywood, Tollywood actor, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు