Home /News /movies /

TOLLYWOOD HERO SATYA DIED WITH HEART ATTACK SB

Tollywood: టాలీవుడ్‌లో విషాదం... యంగ్ హీరో ఆకస్మిక మృతి

టాలీవుడ్‌లో విషాదం

టాలీవుడ్‌లో విషాదం

గత కొన్నాళ్లుగా అతడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది. రెండు మూడురోజుల క్రితమే ప్రముఖ సింగర్ కేకే (kk) మృతి చెందాడు. అయితే తాజాగా మరో యంగ్ హీరో అకస్మాత్తుగా మరణించాడు. తెలుగు హీరో సత్య హఠాత్తుగా చనిపోయాడు. సత్య(Satya) ‘వరం’, ‘బ్యాచిలర్స్’ లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే గురువారం రాత్రి గుండెపోటుతో హీరో సత్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయమైన సత్య పూర్తి పేరు వి. రామసత్యనారాయణ.

    పలు స్టార్ హీరోల సినిమాలలో హీరోకు ఫ్రెండ్ గా నటించిన సత్య ‘వరం’ సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం ఆశించిన ఫలితం అందివ్వలేకపోయింది. ఈ సినిమా తర్వాత ‘బ్యాచిలర్స్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అది కూడా బోల్తా పడడంతో ఇండస్ట్రీకి స్వస్తి పలికి గత కొన్నాళ్లుగా బిజినెస్ చూసుకుంటున్నాడు. అయితే తేజ తల్లి కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయారు. ఆ తర్వత భార్య కూడా కరోనా సమయంలోనే మృతి చెందారు. దీంతో తల్లి, భార్య ఒకేసారి చనిపోవడంతో సత్య ఆరోగ్యంపై కూడా ఆ ప్రభావం పడింది. దీంతో అతడు గతకొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

    గురువారం సత్యకు గుండె పోటు వచ్చింది. ఛాతిలో నొప్పి అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో అతడ్ని వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ లోపే సత్య చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక సత్యకు 8 ఏళ్ల కూతురు ఉంది. మొన్న తల్లిని, ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న ఆ చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. సత్య మరణవార్త తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Tollywood, Tollywood actor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు