Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి తేజ్ ఔదార్యం.. ‘అమ్మ ప్రేమ ఆదరణ’ పేరుతో వృద్ధాశ్రమం..

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)

Sai Dharam Tej: సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌(Sai Dharam Tej) సినిమాల విషయంలోనే కాదు.. సాయం విషయంలోనూ ముందున్నాడు. ఇప్పటికే ఓ స్కూల్‌ను దత్తత తీసుకుని అక్కడ పిల్లల బాగోగులు చూసుకుంటున్నాడు సాయి. ఇప్పుడు ఓ వృద్ధాశ్రమం కట్టించాడు.

  • Share this:
సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌ సినిమాల విషయంలోనే కాదు.. సాయం విషయంలోనూ ముందున్నాడు. ముఖ్యంగా తన మేనమామ పవన్ కళ్యాణ్ అలవాట్లే ఈయనకు కూడా వచ్చాయంటున్నారు అభిమానులు. సాయం చేయడంలో చాలా వరకు ముందే ఉంటాడు ఈయన. ఇప్పటికే ఓ స్కూల్‌ను దత్తత తీసుకుని అక్కడ పిల్లల బాగోగులు చూసుకుంటున్నాడు సాయి. దాంతో పాటు మరిన్ని గుప్తదానాలు కూడా చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు. విజయవాడలో 'అమ్మ ప్రేమ ఆదరణ' అనే వృద్ధాశ్రమానికి శాశ్వత భవనం కట్టిస్తానని రెండేళ్ళ కింద మాటిచ్చాడు సాయి తేజ్. ఇప్పుడు అన్న మాటను నిలబెట్టుకున్నాడు. ఎంతోమంది వృద్ధులు ఎలాంటి అండ లేక అనాథలుగా రోడ్డు మీద పడ్డారు. అలాంటి వాళ్ల కోసం తన వంతు సాయంగా ఓ గూడు కట్టించి ఇచ్చాడు సాయి తేజ్.

రెండేళ్ళ కింద ఈ వృద్ధాశ్రమ పరిస్థితిని సోషల్‌ మీడియాలో చూసి తెలుసుకున్న సాయి తేజ్‌.. తన అభిమానుల సహకారంతో శాశ్వత భవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ భవనం పూర్తయింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
sai dharam tej,sai dharam tej twitter,sai dharam tej instagram,sai dharam tej old age home,sai dharam tej built old age home,sai dharam tej amma prema adarana,telugu cinema,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ ఓల్డ్ ఏజ్ హోమ్,సాయి ధరమ్ తేజ్ అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)

చెప్పినట్లుగా శాశ్వత భవనం కట్టించిన సాయి తేజ్‌కు వృద్ధాశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఓపెనింగ్‌కు కూడా ఆహ్వానం పలుకుతున్నారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు సాయి చేతిలో ఉన్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: