హోమ్ /వార్తలు /సినిమా /

Rana: తిరుమలలో రానా షాకింగ్ పని.. అభిమాని సెల్‌ఫోన్ లాక్కున్న భల్లాలదేవ.. !

Rana: తిరుమలలో రానా షాకింగ్ పని.. అభిమాని సెల్‌ఫోన్ లాక్కున్న భల్లాలదేవ.. !

Photo Twitter

Photo Twitter

ప్రముఖ హీరో రానా తిరుమల వెళ్లాడు, భార్య కుటుంబతో కలిసి అతడు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రానా భార్యతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టాలీవుడ్ ప్రముఖ హీరో రానా తిరుమలలో సందడి చేశారు. తన భార్య మిహీకా బజాజ్ తో కలిసి శ్రేవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితో పాటు రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు, తమ్ముడు అభిరామ్ కూడా శ్రీవారిని  దర్శించుకున్నారు. స్వామి వారికి వీరు మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ అర్చకులు వారికి దగ్గరుండి  తీర్థ ప్రసాదాలను అందించారు.

  తిరుమల వచ్చిన రానా, మిహీకాలు సంప్రదాయ దుస్తుల్లో ఉండగా... సురేశ్ బాబు, అభిరామ్ మాల ధరించారు. మరోవైపు వీరిని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఓ ఫ్యాన్ రానాతో సెల్పీ  తీసుకునేందుకు ప్రయత్నించగా... అతడి ఫోన్ ను రానా లాగేశాడు. గుడి దగ్గర సెల్ఫీలు తీయవద్దని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  వైరల్ అవుతోంది.

  ఇక రానా విషయానికి వస్తే..  ఇటీవలే సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకున్నట్లు ప్రకటించాడు. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి అన్ని ఫొటోలను డిలీట్ చేసేశారు. దీంతో ఒక్కసారిగా అతని డివోర్స్ మ్యాటర్ తెరపైకి వచ్చింది.మిహీకాకి రానాకి మధ్య గొడవ జరిగిందంటూ ప్రచారాలు మొదలయ్యాయి. రానా సోషల్ మీడియా నుంచి బయటకు రావడానికి అదే కారణమని, వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీంతో రానా భార్య మిహికా ఆ వార్తలకు చెక్ పెట్టింది. భర్తతో కలిసిన ఫోటోలను షేర్ చేసింది.

  రీసెంట్‌గా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రానా.. నటనా పరంగా మరో మెట్టు ఎక్కినట్లు నిరూపించుకున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విరాట పర్వం తర్వాత .. ఈ పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన హీరో ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో రానా బాబాయ్, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Rana daggubati, Tollywood

  ఉత్తమ కథలు