TOLLYWOOD HERO RANA BROTHER ABHIRAM DAGGUBATI SAYS ABOUT HIS MISTAKES IN LAST FEW YEARS NR
Abhiram Daggubati: అందరూ చేస్తారు.. కానీ నేను చేసింది బయటపడింది: దగ్గుబాటి అభిరామ్
Abhiram Daggubati
Abhiram Daggubati: డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం కానున్నాడు రానా సోదరుడు అభిరామ్. ఇప్పటికే ఆయన నటించిన సినిమా గురించి కొన్ని విషయాలు ప్రకటించగా.. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు.
Abhiram Daggubati: డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం కానున్నాడు రానా సోదరుడు అభిరామ్. ఇప్పటికే ఆయన నటించిన సినిమా గురించి కొన్ని విషయాలు ప్రకటించగా.. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఆర్.పి.పట్నాయక్ సంగీతాన్ని వినిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే అభిరామ్ పై గతంలో శ్రీ రెడ్డి ఇష్యూ బాగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిరామ్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. తప్పులు అందరూ చేస్తుంటారని, కానీ తాను చేసిన తప్పులు మాత్రం బయటకు వచ్చాయని తెలిపాడు. తనకు నటుడిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఆసక్తి ఉందని తెలిపాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ వంటి సినిమాలలో నటించాలనుందట.
ఇక తేజ దర్శకత్వంలో హీరో గా ఎంట్రీ ఇస్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా తనకు ఒకింత భయం కూడా ఉందని అంటున్నాడు. తేజ వర్క్ ఎలా ఉంటుందో తన సోదరుడు రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనే అర్థమైందని తెలిపాడు. అంతేకాకుండా అభిరామ్ నేరుగా తేజతో నన్ను హీరోగా మీరే పరిచయం చేయాలి సార్ అని ఎన్నోసార్లు అనేవాడట. తేజ కూడా తనకోసం ఓ కథ రాస్తానని కూడా అనేవారట.
ఇక తేజ కథ రాసి తన నాన్నకు చూపించగా వెంటనే కథ నచ్చడంతో హీరోగా పరిచయం అవుతున్నానని తెలిపాడు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితి వల్ల ఇంకా ప్రారంభించలేదని.. దీని తీవ్రత తగ్గాక సెట్లోకి అడుగు పెడతామని తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే గతంలో తనపై జరిగిన క్యాస్టింగ్ కౌచ్, ర్యాష్ డ్రైవింగ్ గురించి స్పందిస్తూ.. తప్పులు అందరూ చేస్తారని, కానీ తాను చేసిన తప్పులు బయటపడ్డాయని, వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఇక ఆ సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని, ఏ పనులు చేయాలి.. చేయకూడదు అనే విషయం ఇప్పుడు తెలిసిందని అంటున్నాడు. నటుడిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు ఇలా జరగడం వల్ల తనకు భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకూడదని అర్థమైందని తెలిపాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.