హోమ్ /వార్తలు /సినిమా /

Video viral : కెన్యాలో రామ్‌చరణ్ సాహసయాత్ర .. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Video viral : కెన్యాలో రామ్‌చరణ్ సాహసయాత్ర .. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Video viral: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ప్రస్తుతం కెన్యాలో గడుపుతున్నారు. విదేశాల్లోని అందమైన లొకేషన్లే కాదు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో జాలీ ట్రిప్ వేశాడు రామ్‌చరణ్. మెగా హీరో కెన్యాలో చేస్తున్న సాహసోపేతమైన టూర్‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెగా పవర్ స్టార్ ఆఫ్రికా టూర్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. జపాన్‌లో ట్రిపులార్ మూవీ ప్రమోషన్‌ కోసం చిత్ర దర్శకుడు రాజమౌళి, కో స్టార్ తారక్ ఫ్యామిలీతో కలిసి రామ్‌చరణ్‌(Ram charan)కూడా తన లైఫ్ పార్టనర్ ఉపాసన(Upasana)తో జపాన్‌(Japan)టూర్ వెళ్లారు. జపాన్‌ టూర్‌ ముగించుకున్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ప్రస్తుతం కెన్యా(Kenya)లో గడుపుతున్నారు. అయితే విదేశాల్లోని అందమైన లొకేషన్లే కాదు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో జాలీ ట్రిప్ వేశాడు రామ్‌చరణ్. మెగా హీరో ఆఫ్రికాలో చేస్తున్న సాహసోపేతమైన టూర్‌కి సంబంధించిన వీడియో వైరల్ (Video viral)అవుతోంది.

Samantha | Akhil: సమంతకు అరుదైన వ్యాధి .. అందరి ప్రేమాభిమానాలే నీకు బలం అంటూ అక్కినేని అఖిల్ ఓదార్పు

రామ్‌చరణ్ సాహాసయాత్ర..

టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కించిన ప్యాన్ ఇండియా మూవీ ప్రపంచ దేశాల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో భాగంగానే హీరోలు రామ్‌చరణ్, తారక్, ఫ్యామిలీతో కలిసి జపాన్‌లో ట్రిపులార్ ప్రమోషన్‌కి వెళ్లారు. ఆ టూర్‌తో పాటు రాంచరణ్ వరల్డ్ టూర్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కెన్యాలో ఉన్న మెగా పవర్ స్టార్ ఆఫ్రికాలో సఫారీ ట్రయిల్‌లో బిజీగా ఉన్నారు. అక్కడున్న అరుదైన వన్యప్రాణులను చూస్తు...వాటి అరుపులు, ఆవాసానికి సంబంధించిన దృశ్యాలను తానే ప్రత్యక్షంగా ఓ జీప్‌లో ట్రిప్ వేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నాడు.

కెన్యాలో చెర్రి..

ఆఫ్రికాలోని అత్యంత జనావాసాలకు దూరంగా..అడవి జంతువులు, వన్యప్రాణులు, క్రూరమృగాలు ఉండే ప్రాంతంలో విహార యాత్ర చేస్తున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. అక్కడి స్థానికులను జీప్‌లో ఎక్కించుకొని తానే డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడి లొకేషన్లు, అరుదైన వన్యప్రాణుల్ని కెమెరాలో బంధిస్తున్నాడు. అంతే కాదు ఎడారి ప్రాంతంలో అక్కడ కోడి గుడ్లతో స్వయంగా తానే ఆమ్లేట్లు వేసి వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

మెగా డేరింగ్ ..

జపాన్‌ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను హీరో రామ్‌చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఆఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం చెర్రి షేర్ చేసిన ఆఫ్రికాలో విహార యాత్ర చేస్తున్న వీడియోను చూస్తున్న మెగా అభిమానులు ఎంతో క్రేజీగా ఉందంటున్నారు.

First published:

Tags: Ram Charan, Tollywood actor, Viral Video

ఉత్తమ కథలు