Chirtutha movie 14 years: బాక్సాఫీస్‌పై ‘చిరుత’ అటాక్‌కు 14 ఏళ్ళు పూర్తి.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

చిరుత సినిమాకు 14 ఏళ్ళు పూర్తి (Chirutha movie)

Chirtutha movie 14 years: రామ్ చ‌ర‌ణ్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 14 ఏళ్లు (Ram Charan Chirtutha movie 14 years) పూర్తైపోయాయి. చిరుత‌తో ఈ చిరు త‌న‌యుడు వ‌చ్చి 14 ఇయ‌ర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 14 ఏళ్లలో చ‌ర‌ణ్ చాలా అద్భుతాలు చేసాడు.. సాహ‌సాలు చేసాడు. 2007 సెప్టెంబ‌ర్ 28న చ‌ర‌ణ్ తొలి సినిమా చిరుత విడుద‌లైంది.

  • Share this:
కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుందంటే ఏమో అనుకున్నాం కానీ రామ్ చ‌ర‌ణ్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 14 ఏళ్లు పూర్తైపోయాయి. చిరుత‌తో ఈ చిరు త‌న‌యుడు వ‌చ్చి 14 ఇయ‌ర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 14 ఏళ్లలో చ‌ర‌ణ్ చాలా అద్భుతాలు చేసాడు.. సాహ‌సాలు చేసాడు. 2007 సెప్టెంబ‌ర్ 28న చ‌ర‌ణ్ తొలి సినిమా చిరుత విడుద‌లైంది. ఆ రోజు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు కూడా. పూరీ బర్త్ డే రోజే చిరుత విడుదలైంది. చిరంజీవి త‌న‌యుడు అనే బాధ్య‌త‌.. భారీ అంచ‌నాలు.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు.. అశ్వినీ ద‌త్ లాంటి మెగా నిర్మాత‌.. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన మ్యూజిక్.. ఇవ‌న్నీ చిరుత‌ను హిట్ చేసాయి. కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే రాలేదు గానీ.. చ‌ర‌ణ్ కు సూప‌ర్ లాంచింగ్ ప్యాడ్‌గా ఉప‌యోగ‌ప‌డింది చిరుత‌. ఈ సినిమా చ‌ర‌ణ్ కెరీర్‌కు స‌రైన బేస్ వేసింది. చిరుత త‌ర్వాత మ‌గ‌ధీర‌తో ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసాడు రామ్ చ‌ర‌ణ్.

పదేళ్ల కిందే ఏకంగా 75 కోట్ల షేర్ వ‌సూలు చేసాడు రామ్ చ‌ర‌ణ్. రెండో సినిమాతోనే త‌న స్టామినా ఏంటో చూపించాడు. ఇక త‌న‌కున్న మాస్ ఇమేజ్ ప‌క్క‌న‌బెట్టి ఆరెంజ్ లాంటి క్యూట్ ల‌వ్ స్టోరీలో ఒదిగిపోయాడు. అయితే ఈ సినిమా చ‌ర‌ణ్ ఆశ‌ల్నినిల‌బెట్ట‌లేదు. ఆ త‌ర్వాత ర‌చ్చ‌, నాయ‌క్, ఎవ‌డు, ధృవ, రంగస్థలం లాంటి మాస్ సినిమాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. మ‌ధ్య‌లో జంజీర్ రీమేక్‌తో బాలీవుడ్ కూడా వెళ్లొచ్చాడు చ‌ర‌ణ్. ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. గోవిందుడు అంద‌రివాడేలేతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేసాడు చ‌ర‌ణ్. ఇది కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయింది కూడా. ప్ర‌స్తుతం హీరోగా, నిర్మాత‌గా రెండు పాత్ర‌ల్లోనూ బిజీగా ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్. తండ్రి సినిమాలు నిర్మిస్తూనే.. రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో పాన్ ఇండియన్ సినిమాల్లో చేస్తున్నాడు రామ్ చరణ్. చిరుత సినిమా వసూళ్లు ఒక్కసారి ఇప్పుడు చూద్దాం..

Dimple Hayati: సెక్సీ పోజులతో పిచ్చెక్కిస్తున్న ‘ఖిలాడి’ బ్యూటీ డింపుల్ హయతీ..


నైజాం: 6.75 కోట్లు
సీడెడ్: 5.60 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.40 కోట్లు
ఈస్ట్: 1.60 కోట్లు
వెస్ట్: 1.65 కోట్లు
గుంటూరు: 2.25 కోట్లు
కృష్ణా: 1.63 కోట్లు
నెల్లూరు: 1.05 కోట్లు

ఏపీ + తెలంగాణ: 22.75 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక: 2.02 కోట్లు
ఓవర్సీస్: 30 లక్షలు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 25.15 కోట్లు షేర్

Prabhas movies: ప్రభాస్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. 365 రోజుల్లో 3 సినిమాలు..


చిరుత సినిమాను 9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు అశ్వినీదత్. రామ్ చరణ్ మొదటి సినిమా కాబట్టి బిజినెస్ కూడా బాగానే జరిగింది. దాదాపు 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది చిరుత సినిమాకు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 25 కోట్లు షేర్ వసూలు చేసి.. మంచి విజయమే సాధించింది.
Published by:Praveen Kumar Vadla
First published: