Raj Tarun: మొదట మంచి హిట్ లు అందుకుంటున్న తరుణంలో.. ఆ ఉద్దేశంతోనే మరిన్ని కథలను ఇష్టానుసారంగా ఎంచుకొని విజయం అందిస్తోంది అనుకున్న ఆ యువ హీరో కు.. ఇప్పుడు ఒక్క హిట్ కూడా అందట్లేదు.ఇంతకీ ఆ యువ హీరో ఎవరో కాదు..ఉయ్యాల జంపలా మూవీ హీరో రాజ్ తరుణ్. కేరీర్ మొదట్లో మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నా కానీ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు.
సినిమా చూపిస్తా మామ, కుమారి 21 ఎఫ్ లో నటించగా.. ఇవి మంచి విజయాన్ని అందిచాయి.ఇక ఆ తరువాత పలు సినిమాలలో నటించగా.. అంత సక్సెస్ అందలేవు. ఇక అప్పటి నుంచి సినీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్ ఎలాగైనా సక్సెస్ ని పొందాలనే పట్టుతో తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'పవర్ ప్లే' లో నటించగా ఈ సినిమా అంతా విజయాన్ని ఇవ్వలేదు.
ఇక లవ్ నేపథ్యంలో కాకుండా కొత్తరకం పాత్రలతో చేయాలనే ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఎన్నో పరాజయాలు పొందిన రాజ్ తరుణ్ కు ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవలే వాటి వివరాల గురించి బయట పెట్టగా.. డైరెక్టర్ శ్రీవాస్ గవిరెడ్డి తో ఓ సినిమా ఇప్పటికే పూర్తికావచ్చిందని గడిపాడు. అంతే కాకుండా మరో డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తుండగా అదికూడా అరవై శాతం పూర్తయిందని తెలిపాడు. ఇక వీటితో పాటు మరో కొత్త దర్శకుడితో దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా దాదాపు పూర్తి అయిందని తెలిపాడు. అంతేకాకుండా విజయ్ కుమార్ కొండా తో ఓ హ్యాట్రిక్ సినిమా చేయనున్నట్లు తెలిపాడు. ఇన్ని ఆఫర్ లతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడైనా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.