పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్

ప్రభాస్ లవ్‌ పడ్డాడా? అయితే డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరూ? ఆయన మనసుదోచిన అమ్మాయి ఎవరు అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు అతని అభిమానులు.

news18-telugu
Updated: August 18, 2019, 3:16 PM IST
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్
ప్రభాస్
news18-telugu
Updated: August 18, 2019, 3:16 PM IST
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ ఇంట్రస్టింగ్ టాపిక్కే. ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ప్రభాస్ పెళ్లి చర్చనీయాంశంగా ఉండేది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవ్వడంతో ప్రభాస్ పెళ్లిపై ఇప్పుడు ఇండియా అంతటా అతని అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. తాజాగా పెళ్లిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ మీడియా ప్రశ్నించగా.. బాహుబలి ఇంట్రస్టింగ్ సమాధానమిచ్చాడు. పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుందన్న డార్లింగ్ ప్రభాస్... అది లవ్ మ్యారేజ్ కూడా కావొచ్చు అంటూ.. అందర్నీ షాక్‌కు గురి చేశారు. దీంతో ప్రభాస్ లవ్‌ పడ్డాడా? అయితే డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరూ? ఆయన మనసుదోచిన అమ్మాయి ఎవరు అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు సాహో సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...