Nithin Macherla Niyojakavargam: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదే చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇందులో చెక్ సినిమా బాగా నిరాశపరిచింది. రంగ్ దే తో కొంతవరకు మెప్పించాడు.
ఇక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన మాస్ట్రో సినిమాలో నటించగా ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఇక ఎస్.ఆర్ శేఖర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండగా ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు ఈరోజు పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి.
తాజాగా నితిన్ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశాడు. అందులో మాచర్ల నియోజకవర్గం అని టైటిల్ పెట్టగా నితిన్ లుక్ చాలా సీరియస్ గా కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. వాల్యూమ్ పెంచండి.. మన నియోజకవర్గంకి ఎంటర్ అవ్వండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు నితిన్ సర్ ప్రైజ్ పోస్టర్ ను చూశారా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero Nithin, Kreethi shetty, Macherla Niyojakavargam, Tollywood