వచ్చే నెలలోనే నితిన్, షాలినీ వివాహాం.. ఏ రోజు అంటే..

అయితే వీరి పెళ్లి డిసెంబర్‌లో జరగనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా వీరి పెళ్లి జూలైలో జరగనున్నట్టు వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు చెబుతున్నారు.

news18-telugu
Updated: June 23, 2020, 7:38 PM IST
వచ్చే నెలలోనే నితిన్, షాలినీ వివాహాం.. ఏ రోజు అంటే..
నితిన్ షాలిని పెళ్లి (Nithiin Shalini wedding)
  • Share this:
కరోనా మహామ్మారి పేదల నుంచి పెద్దోళ్ల వరకు  అందర్నీ భయపెడుతున్నాయి. ఇప్పుడు హీరో నితిన్ పెళ్లికి కూడా ఈ కష్టాలు వచ్చాయి. ఇప్పటికే ఎలాగోలా దిల్ రాజు, నిఖిల్ లాంటి వాళ్లు కరోనా కాలంలోనే పెళ్లి చేసుకున్నారు. కానీ నితిన్ మాత్రం అలా కాదంటున్నాడు.  తన పెళ్లి అనుకున్నట్లుగానే ఘనంగా జరగాలని భావిస్తున్నాడు. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ అభిమానుల సమక్షంలో చేసుకోవాలని ఆశిస్తున్నాడు. నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఈ మధ్యే నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. ఈ జంట దుబాయ్‌లోని హోటల్ పలాజో వర్సాచీలో ఏప్రిల్‌ 16న పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి పెళ్లి డిసెంబర్‌లో జరగనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా వీరి పెళ్లి జూలైలో జరగనున్నట్టు వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు చెబుతున్నారు.

నితిన్ షాలిని పెళ్లి (Nithiin Shalini wedding)
నితిన్ షాలిని పెళ్లి (Nithiin Shalini wedding)


ఇప్పట్లో కరోనా మహామ్మారి కూడా ముగిసేలా కనిపించడం లేదు. అందుకే వచ్చే నెలలో వీళ్ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే దిల్ రాజు, నిఖిల్ కూడా లాక్‌డౌన్‌లోనే సింపుల్‌గా తమ పెళ్లి చేసుకున్నారు. ఇక కరోనా ఆంక్షల నేపథ్యంలో హైదరాబాద్ శివారులో ఓ రిసార్టులో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో నితిన్, శాలినిల వివాాహాం జరగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నడుస్తోంది ఆషాఢ మాసం. ఈ నెలలో పెళ్లిళ్లు లాంటివి ఎవరు జరుపుకోరు. ఆ తర్వాత శ్రావణంలో మంచి ముహూర్తాలున్నాయి. అందులో మంచి ముహూర్తానికి వీళ్ల పెళ్లికి లగ్నం కుదిరిందనేది నితిన్ సన్నిహితుల వర్గాలు చెబుతున్నాయి.. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
First published: June 23, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading