టాలీవుడ్ యంగ్ హీరో నాని ..శబరిమల అయ్యప్పస్వామి(Ayyappa temple)ని దర్శించుకున్నారు. మాలాధారణలో ఉన్న నేచురల్ స్టార్ ఇరుముడి కట్టుకొని కాలి నడకన పుణ్యస్తలమైన శబరిమల (Sabarimala)ఆలయానికి చేరుకున్నారు. విచిత్రం ఏమిటంటే శబరిమల జర్నీ హీరో నాని(Hero Nani)ని ఎంతగానో సంతోష పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో ఒక్కటే కాకుండా అయ్యప్పస్వామి దర్శనానికి తన కుమారుడ్ని కూడా వెంట బెట్టుకొని వెళ్లాడు. అక్కడ కొడుకుతో కలిసి బంగారంతో తయారు చేసిన 18మెట్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించాడు యంగ్ స్టార్.
అయ్యప్పని దర్శించుకున్న హీరో..
సినిమా సెలబ్రిటీలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కాని వాటిని తూచా తప్పకుండా పాటించడం అన్నీ సమయాల్లో అందరికి సాధ్యపడదు. కాని టాలీవుడ్ యంగ్ హీరో నాని మాత్రం నేను పక్కా లోకల్ అన్నట్లుగా నడుచుకుంటారు. రీసెంట్గా అయ్యప్ప మాల వేసుకున్న హీరో ..ఇరుముడితో శబరిమలకు వెళ్లాడు. అయితే తన వెంట కుమారుడు జున్నుని తీసుకొని వెళ్లి శబరిమల యాత్ర విశేషాల్ని అక్కడ ఆయన పొందిన అనుభూతిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు నాని.
View this post on Instagram
కొడుకుతో కలిసి పూజలు..
తన కుమారుడు, తాను ఇద్దరూ అయ్యప్ప మాల వేసుకున్నారు. అయితే నాని కాలినడకన కొండపైకి చేరుకొని అయ్యప్పస్వామిని దర్శించుకున్నాడు. ఇరుముడితో కాలి నడకన టెంపుల్‌కి వెళ్తున్న వీడియోతో పాటు హీరో, ఆయన కుమారుడు ఇద్దరూ కలిసి అయ్యప్ప టెంపుల్లోని బంగారు మెట్ల దగ్గర పూజలు చేశారు. అనంతరం 18మెట్లపై దీపాలు వెలిగించారు నాని. శబరిమల యాత్రకు సంబంధించిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశాడు.
నేచురల్ స్టార్ వీడియో వైరల్ ..
అత్యంత భక్తి, శ్రద్ధలతో కూడిన శబరిమల యాత్ర ఎంతో అద్భుతంగా సాగిందని..మళ్లీ వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాలని కామెంట్స్ పోస్ట్ చేశాడు టాలీవుడ్ హీరో. స్వామి శరణం' అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు నేచురల్ స్టార్ నాని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nani, Sabarimala Temple, Tollywood actor