• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD HERO MANCHU VISHNU THANKED TELANGANA CHIEF MINISTER KCR FOR ANNOUNCING 2000 RS TO PRIVATE TEACHERS PK

Manchu Vishnu - KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై మంచు విష్ణు హర్షం..

Manchu Vishnu - KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై మంచు విష్ణు హర్షం..

మంచు విష్ణు సీఎం కేసీఆర్ (manchu vishnu kcr)

Manchu Vishnu - KCR: కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
కరోనా సెకండ్ వేవ్ దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ కమ్మేస్తుంది. చూస్తుండగానే రోజుకు కేసులు 1000 నుంచి 3000 లకు పెరిగిపోయాయి. కరోనా మరోసారి అందరి జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి సిద్ధమైపోతుంది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు కూడా కేసీఆర్ నిర్ణయంపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషిస్తున్నారని ఆయన తెలిపాడు. ఈ క్రమంలోనే ఎప్రిల్ 12 ఉదయం మంచు విష్ణు ట్వీట్ చేసాడు. ‘కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతినెలా వాళ్లకి 2000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతం అని తెలిపాడు విష్ణు. ఈ నిర్ణయంతో విద్యారంగంలో ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులకు మీపై మరెంతో గౌరవం పెరిగింది’ అని విష్ణు ట్వీట్ చేసాడు.

ఈయన ఈ మధ్యే మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
Published by:Praveen Kumar Vadla
First published: