HOME »NEWS »MOVIE »tollywood hero manchu manoj whatsapp hacked says hero ta

Manchu Manoj Whatsapp Hack: హీరో మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Manchu Manoj Whatsapp Hack: హీరో మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
మంచు మనోజ్ (Twitter/Photo)

Manchu Manoj Whatsapp Hack: మొన్నటి మొన్న సంక్రాంతి వేళ మంచు లక్ష్మి వాట్సాప్ హ్యాక్ అయిందనే విషయం మరిచిపోక ముందే.. ఈమె ముద్దుల తమ్ముడు హీరో మంచు మనోజ్ వాట్సాప్ ఈ రోజు హ్యాక్ అయింది.

  • Share this:
    Manchu Manoj Whatsapp Hack: మొన్నటి మొన్న సంక్రాంతి వేళ మంచు లక్ష్మి వాట్సాప్ హ్యాక్ అయిందనే విషయం మరిచిపోక ముందే.. ఈమె ముద్దుల తమ్ముడు హీరో మంచు మనోజ్ వాట్సాప్ ఈ రోజు హ్యాక్ అయింది. అసలు హ్యాకర్స్ మంచు ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. అంతకు ముందు శంషాబాద్‌లో మోహన్ బాబు ఇంట్లో కాల్పుల కలకలం రేగింది. మొత్తంగా గత కొన్ని రోజులుగా కొంత మంది పనిగట్టుకొని మోహన్ బాబు ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తునరే విషయం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

    వాట్సాప్ తెచ్చిన కొత్త యూజర్ డేటా ప్రైవసీ పాలిసీపై ఆందోళనల వ్యక్తమవుతున్న తరుణంలోనే మంచు లక్ష్మీ వాట్సాప్ హ్యాక్ అయింది. అది మరిచిపోకముందే మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్ కావడం చర్చనీయాంశమయింది. మంచు మనోజ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ నాకు సంబంధించిన ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నా వాట్సాప్‌కు స్పందించవద్దని కోరాడు.




    వ్యాట్సాప్ హ్యాకయిందన్న విషయం తెలిసి..చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. వాట్సాప్ నుంచి సిగ్నల్ యాప్‌కు మారండని ఎక్కువ మంది సూచిస్తున్నారు. మరికొంత మంది అన్న మీ నంబర్ చెప్పండి.. రెస్పాండ్ కామంటూ చెప్పుకొచ్చారు.

    రీసెంట్‌గా మంచు లక్ష్మి తన వాట్సాప్ హ్యాక్ అయితే.. సైబర్ క్రైమ్ వాళ్లకు కంప్లైంట్ చేసింది. ఇపుడు మంచు మనోజ్ కూడా అదే బాటలో సైబర్ క్రైమ్‌ను కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. , ఇటీవలే ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ బ్యూటీ లాస్య యూట్యూబ్ ఛానెల్ కూడా హ్యాకయింది. సైబర్ నిపుణులు తీవ్రంగా శ్రమించి మళ్లీ ఆమె ఛానెల్‌ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంతలోనే  మంచు లక్ష్మి, ఇపుడు మంచు మనోజ్ వాట్సాప్ ఖాతా కావడం టాలీవుడ్‌లో కలకలం రేపింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 17, 2021, 13:49 IST