హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Manoj Corona: టాలీవుడ్‌లో మళ్లీ కరోనా కాటు.. మంచు మనోజ్‌కు కోవిడ్ పాజిటివ్..

Manchu Manoj Corona: టాలీవుడ్‌లో మళ్లీ కరోనా కాటు.. మంచు మనోజ్‌కు కోవిడ్ పాజిటివ్..

మంచు మనోజ్‌కు కరోనా (Manchu Manoj Corona)

మంచు మనోజ్‌కు కరోనా (Manchu Manoj Corona)

Manchu Manoj Corona: తాజాగా మరోసారి టాలీవుడ్‌లో కరోనా మళ్లీ మొదలైంది. యువ హీరో మంచు మనోజ్‌కు (Manchu Manoj Corona) కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు. కరోనాకు చిన్నా పెద్దా తేడా లేదు. కాస్త అలసత్వం చూపిస్తే దాని బారిన పడక తప్పదు.

ఇంకా చదవండి ...

తాను ఇంకా పోలేదు.. ఇప్పటికీ ఉన్నానని గుర్తు చేస్తూనే ఉంది కరోనా మహామ్మారి(COVID 19). మరోసారి ఇండస్ట్రీపై వేటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా అటాక్ చేయడం ఖాయం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా మరోసారి టాలీవుడ్‌లో కరోనా మళ్లీ మొదలైంది. యువ హీరో మంచు మనోజ్‌కు (Manchu Manoj) కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించాడు. కరోనాకు చిన్నా పెద్దా తేడా లేదు. కాస్త అలసత్వం చూపిస్తే దాని బారిన పడక తప్పదు. ఈ మధ్య కాలంలో సినిమా వాళ్లు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తమిళంలో కమల్ హాసన్, విక్రమ్, వడివేలు సహా చాలా మంది ఈ మధ్య కోవిడ్ బారిన పడ్డారు. అలాగే బాలీవుడ్‌లో కూడా కరణ్ జోహార్ పార్టీకి వెళ్లిన చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. అందులో కరీనా కపూర్, మలైకా అరోరా సహా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్‌కు కూడా వచ్చేస్తుంది కరోనా మహమ్మారి.

తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ట్వీట్ చేసాడు ఈ హీరో. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పాడు ఈయన. తనను గత వారం రోజులుగా కలిసిన వాళ్లందరూ దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండని ఆయన సూచించాడు. అలాగే ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.


తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తాను క్షేమంగా ఉన్నానని చెప్పాడు మనోజ్. ఎప్పటికీ మీ ప్రేమ, ఆశీర్వాదాలు తనతోనే ఉంటాయని.. తనకేం కాదని చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స్‌లకు ధన్యవాదాలు తెలిపాడు మనోజ్. ఒమిక్రాన్ దేశంలో మెల్లమెల్లగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు ఇప్పటికే సూచిస్తున్నాయి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Manchu Manoj, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు