TOLLYWOOD HERO MANCHU MANOJ STARTS NEW BUSINESS AND SAYING GOOD BYE TO FILMS NR
Manchu Manoj: కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మంచు మనోజ్.. సినిమాలకు గుడ్ బై?
Manchu Manoj
Manchu Manoj: ఈమధ్య చాలా మంది హీరోలు బిజినెస్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా హీరోయిన్స్ కూడా బిజినెస్ రంగాలలో అడుగులు పెట్టి తెగ బిజీ అవుతున్నారు.
Manchu Manoj: ఈమధ్య చాలా మంది హీరోలు బిజినెస్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా హీరోయిన్స్ కూడా బిజినెస్ రంగాలలో అడుగులు పెట్టి తెగ బిజీ అవుతున్నారు. కొందరు ఓ వైపు సినిమాలను చూసుకుంటూనే మరోవైపు బిజినెస్ లను చూసుకుంటున్నారు. మరికొందరు సినిమాలనే దూరంగా పెట్టి కేవలం బిజినెస్ లను మాత్రమే చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ కూడా ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు.
తెలుగు సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ గురించి అందరికి తెలిసిందే. బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మనోజ్.. పలు సినిమాలలో బాల నటుడిగానే నటించాడు. ఆ తర్వాత దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అలా వరుసగా పలు సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈ మధ్య అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోతున్నాడు మంచు మనోజ్. గతంలో తన సొంత బ్యానర్ లో అహం బ్రహ్మాస్మి అనే సినిమాను కూడా ప్రారంభించగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా విడుదల చేశారు. కానీ మళ్లీ ఈ సినిమా గురించి మళ్లీ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇంతవరకు రాలేదు. ఇంతకీ ఈ సినిమా ఉంటుందా లేదా అని కూడా తెగ ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇదిలా ఉంటే మంచు మనోజ్ ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు కనిపిస్తుంది. ఇక ఆయన ఆంధ్ర తెలంగాణలో వెంచర్స్ లను ప్రారంభించనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా వీలైనంత త్వరలో చాలా మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నాడట. ఇక ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నాడు మంచు మనోజ్. ఇక ఇటీవలే తన సోదరి మంచు లక్ష్మి తో చాలా రోజుల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు మంచు మనోజ్.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.