Home /News /movies /

TOLLYWOOD HERO MANCHU MANOJ SECOND MARRIAGE ON CARDS AND DO YOU KNOW THE BRIDE DETAILS PK

Manchu Manoj second marriage: మంచు మనోజ్ రెండో పెళ్లిపై అప్‌డేట్.. అమ్మాయి ఎవరంటే..?

మంచు మనోజ్ (Manchu Manoj)

మంచు మనోజ్ (Manchu Manoj)

Manchu Manoj second marriage: మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకుంటున్నాడా..? ఈ ప్రశ్నకు సమాధానం అవును చేసుకుంటున్నాడు.. అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో మంచు మనోజ్‌ మాత్రం ఎప్పుడూ స్పందించింది లేదు.

ఇంకా చదవండి ...
మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకుంటున్నాడా..? ఈ ప్రశ్నకు సమాధానం అవును చేసుకుంటున్నాడు.. అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో మంచు మనోజ్‌ మాత్రం ఎప్పుడూ స్పందించింది లేదు. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు దేశమంతా స్నేహితులతో కలిసి చుట్టేసాడు మనోజ్. ఆ తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయాడు. అసలు రెండో పెళ్లి ఆలోచన కూడా ఎప్పుడూ చేసినట్లు కనిపించలేదు ఈయన. అయితే ఎన్నాళ్లూ ఇలాగే ఉంటావ్.. రెండో పెళ్లి చేసుకో అంటూ కొందరు ఆయనకు చెప్పినట్లు తెలుస్తుంది. అందులో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని.. ఎలాగైనా మనసు మార్చి మనోజ్‌ను మరోసారి ఇంటివాన్ని చేయాలని వాళ్లు భావిస్తున్నారు. ఈ మధ్యే భార్యతో విడాకుల ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. దీంతో మనోజ్ మరోసారి పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే మనోజ్‌ ఎవర్ని చేసుకోబోతున్నాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఓ హీరోయిన్ ప్రేమలో ఆయన ఉన్నాడని.. ఆమెనే రెండో పెళ్లి చేసుకుంటాడని వార్తలొచ్చినా అది కూడా అబద్ధమే అని మంచు మనోజ్ సంబంధిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం. మనోజ్ తండ్రి.. కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు తన కొడుకు పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తమ కుటుంబానికి దగ్గరి బంధువైన ఓ అమ్మాయిని ఇప్పటికే చూసాడని.. ఆమెతోనే మనోజ్‌ వివాహం జరగనుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక సమాచారం కూడా రావడం ఖాయంగా కనిపిస్తుంది.
manchu manoj second marriage,manchu manj,manchu manoj wife,manchu manoj divorce,manchu manoj tweet about second marriage,manchu manoj marriage,manchu manoj about his wife pranathi,manchu manoj divorce with his wife,manchu manoj wedding,manchu manoj wife pranathi,manchu manoj getting ready for second marriage,manchu manoj second wedding,manchu manoj weds pranathi reddy,manchu manoj marriage video,manchu manoj divorce issue,మంచు మనోజ్,మంచు మనోజ్ రెండో పెళ్లి,మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్,బంధువుల అమ్మాయితో మంచు మనోజ్ రెండో పెళ్లి
మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి ఫస్ట్ లుక్ (manchu manoj aham brahmasmi movie)

మరో రెండు నెలల్లోనే మనోజ్ రెండో పెళ్లి ఉండబోతుందనేది ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. ఇదిలా ఉంటే 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మనోజ్‌. అయితే పెళ్లైన కొన్ని రోజులకే వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి తారాస్థాయికి చేరిపోవడంతో అధికారికంగా విడిపోయారు. పెళ్లి అయిన తర్వాత ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేస్తుండటం.. ఇటు మనోజ్‌ సినిమాలతో బిజీగా ఉండటంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.. అవే చిలికి చిలికి గాలివానలా మారిపోయాయని అప్పట్లో న్యూస్ వచ్చింది.
manchu manoj second marriage,manchu manj,manchu manoj wife,manchu manoj divorce,manchu manoj tweet about second marriage,manchu manoj marriage,manchu manoj about his wife pranathi,manchu manoj divorce with his wife,manchu manoj wedding,manchu manoj wife pranathi,manchu manoj getting ready for second marriage,manchu manoj second wedding,manchu manoj weds pranathi reddy,manchu manoj marriage video,manchu manoj divorce issue,మంచు మనోజ్,మంచు మనోజ్ రెండో పెళ్లి,మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్,బంధువుల అమ్మాయితో మంచు మనోజ్ రెండో పెళ్లి
మంచు మనోజ్ ప్రణతి (manchu manoj pranath)

వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల కారణంగానే మూడేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. ఇప్పుడు ‘అహం బ్రహ్మస్మి’తో వస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఏదేమైనా కూడా మనోజ్ రెండో పెళ్లి వార్త మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Manchu Manoj, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు