
మంచు మనోజ్ (Twitter/Photo)
Manchu Manoj: తెలుగు ఇండస్ట్రీలో స్నేహానికి అతి ప్రాధాన్యత ఇచ్చే వాళ్లలో మంచు మనోజ్ కూడా ఉంటాడు. ఆయనకు స్నేహం అంటే ప్రాణమిస్తాడు. తన స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. కష్టం అంటూ వస్తే కచ్చితంగా ముందుంటాడు..
తెలుగు ఇండస్ట్రీలో స్నేహానికి అతి ప్రాధాన్యత ఇచ్చే వాళ్లలో మంచు మనోజ్ కూడా ఉంటాడు. ఆయనకు స్నేహం అంటే ప్రాణమిస్తాడు. తన స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. కష్టం అంటూ వస్తే కచ్చితంగా ముందుంటాడు మనోజ్. ఆ మధ్య తన స్నేహితుడు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినపుడు అందరికంటే ముందు మనోజ్ ఉన్నాడు. నిజానికి ఆ సమయంలో ఆయన ఎక్కడో ఉన్నాడు. కానీ విషయం తెలిసిన వెంటనే వచ్చాడు. వచ్చి అక్కడే రెండు రోజుల పాటు కదల్లేదు. స్నేహితుడికి తోడునీడలా ఉన్నాడు. బాడీగార్డులా మారిపోయాడు. ఆ తర్వాత కూడా కొందరి విషయంలో అలాగే ఉన్నాడు మనోజ్. కష్టమంటూ వస్తే కచ్చితంగా ముందుంటాడు ఈ హీరో. ఇప్పుడు కూడా తన స్నేహితుడు చనిపోయాడు. ఈ విషయం తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు ఈ హీరో. మంచు మనోజ్‌కు నటుడు ఆది పినిశెట్టి మంచి ఫ్రెండ్. వీళ్లంతా ఒకే బ్యాచ్ కూడా. అంతా కలిసే ఉంటారు. అదే బ్యాచ్‌లో మౌళి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఆయన ఇప్పుడు చనిపోయాడు. కారణం చెప్పలేదు కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే మౌళి కన్నుమూసాడు. ఇదే విషయాన్ని ఆది పినిశెట్టి తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. దాంతో మనోజ్ తను ట్వీట్ చేసాడు.
మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది బాబాయ్.. రెస్ట్ ఇన్ పీస్ మౌళి.. పెళ్లికి కొన్ని రోజుల ముందే ఇలా కన్నుమూయడం బాధాకరం.. కుటుంబం, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి అంటూ సంతాపం ప్రకటించాడు మనోజ్. ప్రస్తుతం ఈయన ట్వీట్ వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:January 19, 2021, 22:56 IST