Home /News /movies /

TOLLYWOOD HERO MAJOR FAME ADIVI SESH IN LOVE WITH HYDERABAD GIRL NR

Adivi Sesh: ప్రేమలో ఉన్న అడవి శేషు.. ఆ అమ్మాయి ఎవరు తెలుసా?

adivi sesh

adivi sesh

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. హీరోగానే కాకుండా దర్శకత్వంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.

     Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. హీరోగానే కాకుండా దర్శకత్వంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు. ఆయన నటించే ప్రతి సినిమాలో ఆయన పాత్ర తనకు తగ్గట్టుగా ఉండేది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

    2010లో కర్మ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అడవి శేష్ ఆ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలో అవకాశాలు అందుకున్నాడు. 2018లో తెరకెక్కిన గూడచారి సినిమా లో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే అడవి శేష్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

    గతంలో ఇతనికి తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవగా.. తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయాన్ని బయటపెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా తన పర్సనల్ విషయం గురించి పంచుకోగా మళ్లీ తనకు తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురయ్యింది. ఇక దానికి స్పందిస్తూ.. ప్రస్తుతం తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

    కానీ ఒక హైదరాబాద్ అమ్మాయి తో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు. ఇక ఆ అమ్మాయి గురించి ఎటువంటి విషయాలు బయట పెట్టకపోగా, తన అనుమతి కూడా తీసుకోవాల్సి ఉందని.. కానీ ప్రస్తుతం పెళ్లిపై ఆలోచనలు లేవని తెలిపాడు. అంతే కాకుండా తను ఇంకా మరో మూడు ప్రాజెక్టులు పూర్తి చేయవలసిన ఉన్నాయని తెలిపాడు. ఇక ప్రస్తుతం జి ఎన్ వి ప్రొడక్షన్ లో మహేష్ బాబు నిర్మాతగా మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కనుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Adivi Sesh, Hyderabad girl, Major film, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు